కరీంనగర్‌సిటీ: ఔషధాల పరిశోధనల్లో నూతన సాంకేతికతను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని శాతవాహన వీసీ ఉమేశ్‌కుమార్ అన్నారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో ‘సహజ సిద్ధ ఔషధాల ఆవిష్కరణలో కృత్రిమ మేధస్సు పాత్ర’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. మన దేశ ప్రాచీన సంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికత కృత్రిమ మేధస్సుతో అనుసంధానించడం ద్వారా సరికొత్త ఔషధాలను కనుగొనవచ్చని తెలిపారు. రిజిస్ట్రార్ ఆచార్య సతీశ్‌కుమార్ మాట్లాడుతూ, సహజ సిద్ధమైన మూలికా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాలంటే శాసీ్త్రయమైన డేటా, పరిశోధనలు ఎంతో అవసరమన్నారు. డా.ఎస్.రమాకాంత్, డాక్టర్ జయంతి, డా.సరసిజ, నమ్రత తదితరులు పాల్గొన్నారు.


