కరీంనగర్‌కార్పొరేషన్: స్వచ్ఛతలో డీఆర్‌సీ సెంటర్లు కీలకమని అదనపు కలెక్టర్ హరిప్రసాద్ అన్నారు. బుధవారం నగరంలోని హౌసింగ్‌బోర్డుకాలనీ డీఆర్‌సీ సెంటర్‌ను సందర్శించారు. సెంటర్‌లో రీసైక్లింగ్ పనులను పరిశీలించారు. తడి, పొడి చెత్త సేకరణ వివరాలు, తడి చెత్త ద్వారా కంపోస్టు తయారీ, పొడి చెత్త వ్య ర్థాల రీ సైక్లింగ్ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగర పరిశుభ్రతలో తడి, పొడి చెత్త నిర్వహణ ప్రక్రియ ఎంతో ప్రధానమన్నారు. నగరాన్ని స్వచ్ఛ కరీంనగర్‌గా మార్చడంలో డ్రై రీసోర్స్ సెంటర్ల పాత్ర ఎంతో ప్రాధాన్యత కలి గిందన్నారు. డీఆర్‌సీసీ నిర్వాహకులు పొడి చెత్తను ప్లాస్టిక్, అట్టముక్కలు తదితర వస్తువులను సెగ్రిగేషన్ చేసి వాటి వివరాలను నమో దు చేసుకోవాలన్నారు. నగరపాలక సహాయ కమిషనర్ రాజమనోహర్, పర్యావరణ ఇంజినీర్‌లు స్వామి, రమేశ్, శానిటేషన్ సూపర్ వైజర్ శ్యామ్ రాజ్ పాల్గొన్నారు.
కరీంనగర్‌అర్బన్: జిల్లాలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ పనులను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేయాలని ఆర్‌అండ్‌ఆర్ భూ సేకరణ కమిషనర్ కే.శివకుమార్ నాయుడు అధికా రులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, భూ సేకరణ విభాగం, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధి కారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడ్ మానేరు, గౌరవెల్లి రిజర్వాయర్ కాలువలు, కాకతీయ కాలువ, కాళేశ్వరం ప్రాజెక్టు, కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్, మానేరు రివర్‌ఫ్రంట్ తదితర ప్రాజెక్టుల భూ సేకరణ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, ఇరిగేషన్‌తో పాటు అన్నిశాఖల అధికారులు పరస్పర సమన్వయంతో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అవార్డుల జారీ, పరిహారం చెల్లింపులు, పునరావాసం (ఆర్‌అండ్‌ఆర్) అంశాలను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు తక్షణమే పరిహారం అందించాలన్నారు. కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ, జిల్లాలో వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. డీఆర్వో, భూ సేకరణ విభాగం ఇన్‌చార్జి ఎస్‌డీసీ. స్వామి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్‌రావు పాల్గొన్నారు.
తిమ్మాపూర్: మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేడ్కర్, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌న రామ్ విగ్రహాల ఆవిష్కణకు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యానారాయణ అడ్డుపడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. తిమ్మాపూర్‌లో బుధవా రం మాట్లాడుతూ.. తాను అంబేద్కర్ భవనంతో పాటు బస్టాండ్ ప్రాంతాన్ని అంబేద్కర్ హబ్‌గా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల ఆవిష్కరణకు నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు. నాటి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విగ్రహాల ఆవిష్కరణను అడ్డుకున్నారని, ప్రస్తుత ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అనుమతి ఇవ్వడంతో ఆవిష్కరణకు సిద్ధమవుతుండగా కొంతమంది మరోసారి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. విగ్రహాల ను తాళ్లతో బంధించి, పాత బట్టలతో ముసుగులు పెట్టి అవమానించడం బాధాకరమన్నా రు. విగ్రహాలతో రాజకీయం మానుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విగ్రహాలపై ముసుగులు వేసిన వారిపై ఎస్సీ ఎస్టీ చైర్మన్, కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, సంపత్, మైపాల్‌రెడ్డి, తిరుపతి, కొమురయ్య అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.


