బట్టలు అమ్మితేనే బతుకుదెరువు | - | Sakshi
Sakshi News home page

బట్టలు అమ్మితేనే బతుకుదెరువు

Apr 11 2026 4:13 PM | Updated on Apr 11 2026 4:13 PM

ప్రతీ ఆదివారం సిరిసిల్లకు వస్తాం. బట్టలు అమ్మితేనే బతుకుదెరువు. అప్పుడప్పుడు పెద్దగా గిరాకీ ఉండదు. రోజుకో ఊరికి వెళ్తాం కాబట్టి బట్టకు, పొట్టకు తిప్పలు లేకుండా బతుకుతున్నాం. నేను చిన్నప్పటి నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాం. నచ్చినవి ఏరుకుని కొంటారు. చిన్న దందా అయినా పాత బట్టలే మాకు బువ్వ పెడుతున్నాయి.

– ఈ.శ్రీకాంత్‌, పాత బట్టల వ్యాపారీ

ఏం చదువుకోలేదు

నేను ఏం చదువుకోలేదు. మా అమ్మానాన్నల ఇదే చేశారు. నేను కూడా ఈ పనిలోనే ఉన్నా. సిరిసిల్లలో మంచిగా గిరాకీ అవుతుంది. ప్రతీ ఆదివారం రూ.1000 నుంచి రూ.1500 వస్తాయి. అప్పుడప్పుడు ఎక్కువనే వస్తాయి. పొద్దంతా ఇక్కడ ఉండి అమ్ముకుని వెళ్తాం. డ్రెస్‌లు మంచివి ఉంటేనే కొంటారు. లేకుంటే కొనరు.

– బొర్రత్‌ అర్జున్‌, బట్టల వ్యాపారీ

40 ఏళ్లుగా ఇదే దందా

మా పూర్వీకులు కూడా ఇదే దందా చేశారు. నాకు తెలిసి 40 ఏళ్లుగా ఇదే వ్యాపారం సాగుతోంది. సిరిసిల్ల, సిద్దిపేట, వేములవాడ, చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్‌ ఇలా రోజుకో ఊరుకు పోతాం. గిరాకీ అయినా కాకున్నా మా బతుకుదెరువు ఇదే. తక్కువ ధరకే డ్రెస్‌లు రావడంతో మంచివి ఏరుకుని కొంటారు.

– ఇగ్గెవి రాజేశ్‌, సిద్దిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement