సిరిసిల్ల క్రైం: గంజాయి సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి డీ–ఆడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌కు చెందిన మహ్మద్ సద్దాం(32), పాత బస్టాండ్‌కు చెందిన ఎంబేరి ఆకాశ్(26), రాజీవ్‌నగర్‌కు చెందిన మరో బాలుడు కలిసి మహారాష్ట్ర నాందేడ్ నుంచి గంజాయి తెచ్చి, సేవిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తనిఖీలు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పరీక్షించగా గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, గంజాయి అలవాటు నుంచి బయటపడేందుకు స్వచ్ఛందంగా ముందుకురావడంతో న్యాయస్థానం అనుమతితో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ–ఆడిక్షన్ సెంటర్‌కు తరలించారు. సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
డీ ఆడిక్షన్ సెంటర్‌కు తరలింపు


