తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘సెస్’ సంస్థను ఎన్పీడీసీఎల్ స్వాధీనం చేసుకున్న తర్వాత తంగళ్లపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలోని సీసీ కెమెరాల కనెక్షన్‌ను తొలగించారు. గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కనెక్షన్‌ను ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు తొలగించడం చర్చకు దారితీసింది. సాధారణంగా సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో కొత్తవాటిని బిగించి రక్షణ కల్పించాల్సి ఉండగా ఉన్నవాటిని తొలగించడం ఏంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన కడారి మహేశ్(28) శుక్రవారం క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామంలో ట్రాక్టర్ నడుపుతూ జీవించే మహేశ్.. మద్యంలో పురుగులమందు కలుపుకుని తాగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మహేశ్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.


