గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ ఎదుట కారు ఢీకొన్న ప్రమాదంలో ఇందారపు రాయపోశం(60) అనే మున్సిపల్ పర్మినెంట్ కార్మికుడు మృతి చెందాడు. వన్‌టౌన్ ఎస్సై మనోహర్ కథనం ప్రకారం.. కాకతీయనగర్‌లోని తన ఇంటినుంచి నైట్ డ్యూటీ కోసం మున్సిపల్ ఆఫీస్‌కు వచ్చాడు. అనంతరం ఎలక్ట్రీషియన్ చిన్నయ్యతో కలిసి టీ తాగేందుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాయపోశంతో ఉన్న చిన్నయ్య స్వల్పగాయాల పాలయ్యాడు. రాయపోశం వచ్చేనెలలో ఉద్యోగ విరమణ చేయనున్నాడు. అనూహ్యంగా ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


