14 ఏళ్లకు పట్టుబడిన నిందితుడు | - | Sakshi
Sakshi News home page

14 ఏళ్లకు పట్టుబడిన నిందితుడు

Apr 11 2026 4:13 PM | Updated on Apr 11 2026 4:13 PM

సిరిసిల్ల క్రైం: పద్నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న భార్య, ఇద్దరు చిన్నారుల మృతికి కారణమైన నిందితుడిని సిరిసిల్ల పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం మొర్రాయిపల్లికి చెందిన బోయిని ఆంజనేయులు 2007లో భాగ్యలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రీనిధి(5), నైపున్య(2). 2012లో భాగ్యలక్ష్మి మూడోసారి గర్భవతిగా ఉన్న సమయంలో మళ్లీ అమ్మాయి పుడుతుందని అనుమానంతో భర్త, అత్తమామలు ఆమెను వేధింపులకు గురిచేశారు. వేధింపులను తట్టుకోలేక భాగ్యలక్ష్మి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై అదే ఏడాది కేసు నమోదు కాగా.. అప్పటి నుంచి ఆంజనేయులు పరారీలో ఉన్నాడు. న్యాయస్థానం అతనిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. బాధితురాలి తల్లి ఎల్లవ్వ ఈనెల 6న ఎస్పీకి ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో హైదరాబాద్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ చేశారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్‌ఫోర్స్‌ సీఐ నటేశ్‌, ముస్తాబాద్‌ ఎస్సై గణేశ్‌లను అభినందించారు.

భార్యాపిల్లల మృతికి కారణం

తప్పించుకుని తిరుగుతున్న తీరు

ఎట్టకేలకు ఛేదించిన సిరిసిల్ల పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement