
యూరియా నిల్వల తనిఖీ
కరీంనగర్‌రూరల్ /కరీంనగర్ అర్బన్: కరీంనగర్ మండలంలోని ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలను వ్యవసాయాధికారులు పరిశీలించారు. గురువారం ‘సాక్షి’లో ‘యూరియా కష్టాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఏడీఏ రణధీర్, ఏవో సత్యం స్పందించారు. కరీంనగర్, దుర్శేడ్ ప్రాథమిక సహకార సంఘాలతోపాటు తీగలగుట్టపల్లిలోని డీసీఎంఎస్, నగునూరులోని ఆగ్రోస్ సెంటర్, మొగ్ధుంపూర్, చేగుర్తిలోని ప్రైవేట్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. దుర్శేడ్ సొసైటీలో 177 బస్తాలు, చెర్లభూత్కూర్‌లో 383, బొమ్మకల్‌లో904, తీగలగుట్టపల్లి డీసీఎంఎస్‌లో 127, మొగ్ధుంపూర్‌లోని వరలక్ష్మి ఫర్టిలైజర్స్‌లో 85, చేగుర్తిలోని మంజునాధ ఫర్టిలైజర్స్‌లో 65 బస్తాల యూరియా స్టాక్ ఉన్నట్లు ఏవో సత్యం తెలిపారు. . కాగా.. జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని డీఏవో భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.
భోజనంలో నాణ్యత పాటించాలి
కరీంనగర్‌రూరల్: గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాజీ పడొద్దని మైనార్టీ గురుకులాల ప్రత్యేక అధికారి, ఎస్సీకార్పొరేషన్ డీడీ నాగలేశ్వర్ సూచించారు. కరీంనగర్ మండలం ఇరుకుల్లలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. కిచెన్‌రూం, డైనింగ్‌హాల్, స్టోర్‌రూం, తరగతి గదులు, హాస్టల్‌ను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పరిసరా ల పరిశుభ్రతను పాటించాలన్నారు. అనంత రం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రి న్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, కో– ఆర్డినేటర్లు శ్రీలత, మహేందర్, వార్డెన్ ఫకృద్దీన్ పాల్గొన్నారు.
కరీంనగర్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ సమీపంలో విమానాశ్రయం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కేంద్ర విమానాయనశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడిని కోరారు. గురువారం ఢిల్లీలో మంత్రిని కలిసిన ఆయన విమానాశ్రయం ఏర్పాటుకు సర్వే జరిపి, నిధులు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ విస్తరించి ఉందన్నారు. గతంలో సర్వే చేసినా కార్యరూపం దాల్చలేదన్నారు.
జిల్లాలో ఆర్‌ఐల బదిలీ
కరీంనగర్ అర్బన్: రెవెన్యూశాఖలో పలువురు ఆర్‌ఐలను బదిలీ చేస్తూ అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కె.రాఘవేందర్(గన్నేరువరం)ను చొప్పదండికి, జి.మోహన్‌రెడ్డి(చొప్పదండి)ని వీణవంక సీనియర్ అసిస్టెంట్‌గా బదిలీ చేశారు. బి.రజనీకాంత్‌రెడ్డి(గన్నేరువరం)ని గంగాధరకు, కె.ప్రవీణ్(గంగాధర)ను గన్నేరువరం కార్యాలయానికి, కె.వాస్తవిక్ (కరీంనగర్ రూరల్)ను చిగురుమామిడికి, వి.అరుణ్‌కుమార్(చిగురుమామిడి)ను కరీంనగర్ రూరల్‌కు, టి.త్రిపాల్‌సింగ్(చొప్పదండి)ను గన్నేరువరం, ఎండీ.రహీం(శంకరపట్నం)ను చొప్పదండి గిర్దావర్‌గా బదిలీ చేయగా తక్షణమే విధుల్లో చేరాలని పేర్కొన్నారు.
బీసీ గర్జన సభ 14కు వాయిదా
కరీంనగర్: బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్‌లో నిర్వహించ తలపెట్టిన బీసీ గర్జన సభ వాయిదా పడింది. ఈనెల 14న సభను నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కరీంనగర్‌లో ఈనెల 14న భారీ బీసీ గర్జన బహిరంగ సభ ఏర్పాటు చేసి, తరువాత అన్ని జిల్లాకేంద్రాల్లో సభలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడించారు. సభతో కాంగ్రెస్, బీజేపీల బండారాన్ని బయటపెడతామని తెలిపారు.

యూరియా నిల్వల తనిఖీ