
ముగిసిన సీబీఎస్‌ఈ టేబుల్ టెన్నీస్ పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న సీబీఎస్‌ఈ క్లస్టర్–7 బాలికల టేబుల్ టెన్నీస్ చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. అండర్ –14 విభాగంలో వీపీఎస్ పబ్లిక్ స్కూల్, విజయవాడ ప్రథమస్థానంలో టైం స్కూల్, రాజేంద్రనగర్, రంగారెడ్డి నిలిచాయి. అండర్– 17 విభాగంలో శ్రీ ప్రకాశ్ ఎనర్జీ స్కూల్, పెద్దాపురం, తూర్పుగోదావరి ప్రథమస్థానంలో సర్ సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్, పశ్చిమగోదావరి రెండోస్థానంలో నిలిచాయి. అండర్ 19 విభాగంలో శ్రీ ప్రకాశ్ ఎనర్జీ స్కూల్, పెద్దాపురం, తూర్పుగోదావరి ప్రథమస్థానంలో, సర్ సీఆర్‌రెడ్డి పబ్లిక్ స్కూల్, పశ్చిమగోదావరి రెండోస్థానంలో నిలిచాయి. అండర్–14 విభాగంలో ఎస్.మనస్వి, రిద్దిటోరో, కే.నైనా, వంశిక, అండర్ 17లో జి.వర్ణిక, తనిష్క, దాస్, మిద్ది శాంతి జ్యోతి, అండర్ 19లో సాయి సుదీక్ష, రిషికా తులసి, లినేషియా, ఎం.దర్శిక జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి హాజరై విజేతలకు ట్రోపీలు, మెడల్స్ అందజేశారు. పోటీల పరిశీలకుడు పద్మారావు, చీఫ్ రెఫరీ శంకర్, అసోసియేట్ చీఫ్ రెఫరీ రామచంద్రరావు, బాబురావు, ఒతినేల్, ఎండీ గౌస్, రవి, గంగారాం పాల్గొన్నారు.