
తాత, మనుమరాలిని కబళించిన జ్వరం
ముత్తారం(మంథని): జ్వరం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వారంరోజుల వ్యవధిలోనే మనుమరాలు, తాతను కబళించింది. ముత్తారం మండలం కేశనపల్లి గ్రామంలో ఈఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియెట్ చదువుతున్న గూట్ల నవ్య తీవ్రజ్వరంతో బాధపడగా.. హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 2న చనిపోయింది. ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు తేరుకోక ముందే.. ఆమె తాత గూట్ల ఓదెలు(68) అనారోగ్యానికి గురవడంతోపాటు జ్వరంతో గురువారం రాత్రి మృతి చెందాడు. ఒకేకుటుంబంలో మనుమరాలు, తాత జ్వరంతో మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
వారం రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి
విషాదంలో కుటుంబసభ్యులు
కేశనపల్లి గ్రామంలో ఆందోళన

తాత, మనుమరాలిని కబళించిన జ్వరం