
పెద్దపల్లి: పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన వనపర్తి సంధ్య(27) వివాహం ఇష్టంలేక, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వనపర్తి కనుకయ్య, లక్ష్మి మూడో కుమార్తె సంధ్యకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ నెల 14న వివాహం కావాల్సి ఉంది. శుక్రవారం ఉదయం ఇంట్లో వారు పెళ్లి పనుల్లో ఉండగా.. ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందింది. మృతురాలి తండ్రి కనుకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేశ్‌రెడ్డి తెలిపారు.
దొంగతనం మోపారని యువకుడు..
జూలపల్లి(పెద్దపల్లి): తనపై దొంగతనం మోపారనే అవమాన భారంతో వడ్కాపూర్ గ్రామానికి చెందిన ఐలవేని రంజిత్(25) చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. వడ్కాపూర్ గ్రామానికి రంజిత్ ఈనెల 6న సాయంత్రం మద్యం కొనుగోలు కోసం అదేగ్రామంలోని అంగరి రజిత బెల్ట్‌షాపుకు వెళ్లాడు. బీరు కొనుగోలు చేసి తాగాడు. ఇంటికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. కౌంటర్‌లోని డబ్బులు లేవని, ఆ డబ్బు తీశాడనే నెపంతో బెల్ట్‌షాపు నిర్వాహకులు రంజిత్ బట్టలు విప్పి తనిఖీ చేశారు.
దీనిని అవమానంగా భావించిన యువకుడు.. ఇంటికి వెళ్లాడు. తాను కరీంనగర్ వెళ్లి పని చేసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు. అయితే, గురువారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా.. ఇంటికి వచి్చన రంజిత్ చీరతో దూలానికి ఉరివేసుకుని చనిపోయాడు. తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తలుపులు పెట్టి ఉన్నాయి. కిటికిలోంచి చూడగా రంజిత్ ఉరి వేసుకుని కనిపించాడు. మృతుని తండ్రి రాజమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సనత్‌కుమార్ తెలిపారు.