నాకు నీడగా.. | - | Sakshi
Sakshi News home page

నాకు నీడగా..

Aug 9 2025 7:39 AM | Updated on Aug 9 2025 7:39 AM

నాకు

నాకు నీడగా..

దేశ, విదేశాలకు రాఖీ‘పోస్టు’
నీకు తోడుగా

మేము ముగ్గురం అక్కచెల్లెలం, ఒక్కడే అన్న. పేరు నాగవెల్లి గణేశ్‌. మాది కరీంనగర్‌ అయినప్పటికీ పుట్టిపెరిగింది ఛత్తీస్‌గఢ్‌. అక్కడే అమ్మానాన్న, అన్నయ్య ఉంటారు. పెళ్లిళ్లు చేసుకుని ఒక్కోక్కరం ఒక్కోచోట స్థిరపడ్డాం. ఏటా రాఖీ పండుగకు అందరం కలిసి పుట్టినిల్లు ఛత్తీస్‌గఢ్‌ వెళ్లి అన్నయ్యకు రాఖీ కట్టి పండుగను ఆనందంగా జరుపుకుంటాం.

– రాచకొండ రేణుక, ప్రొఫెషనల్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌, కరీంనగర్‌

రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం నుంచి కరీంనగర్‌ టు జేబీఎస్‌ వరకు 200 అదనపు బస్సులు నడిపిస్తున్నాం. కరీంనగర్‌ డిపోల పరిధిలోని వివిధ ప్రాంతాలకు 250 బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశాం. ఆయా రూట్లలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తాం.

– బి.రాజు, ఆర్టీసీ కరీంనగర్‌ రీజనల్‌ మేనేజర్‌

బోయినపల్లి(చొప్పదండి): ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగ, వ్యాపార తదితర పనుల నిమిత్తం పలువురు దేశ, విదేశాల్లో ఉంటున్నారు. ఇలాంటి వారికి రాఖీలు అందించే వేదిక తపాల శాఖ. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు పోస్టులో రాఖీలు పంపడానికి పోస్టాఫీస్‌కు చాలా మంది వస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు సైతం పోస్టు ద్వారా రాఖీలు పంపిస్తున్నారు. ఎక్కువశాతం హైదరాబాద్‌, బెంగళూర్‌, ముంబై ప్రాంతాలకు రాఖీల పోస్టు ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే కొందరు మహిళలు లండన్‌, అమెరికా తదితర దేశాల్లో ఉన్నవారికి సైతం రాఖీలు పోస్టు ద్వారా పంపుతారు. రిజిస్టర్‌ పోస్టు ద్వారా రూ.40– రూ.60 వరకు బరువును బట్టి చార్జ్‌ చేస్తున్నారు.

విద్యానగర్‌(కరీంనగర్‌): నాకు తమ్ముడున్నాడు. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇద్దరం అమెరికాలోనే ఉన్నాం. నేను జాబ్‌ చేస్తున్న. తమ్ముడు నాతోపాటు ఉంటూ చదువుకుంటున్నాడు. గతేడాది నుంచి అమెరికాలోనే రాఖీ పండుగా జరుపుకుంటున్నాం. ఈసారి కూడా ఇక్కడే రాఖీ కడుతా.

– తొడుపునూరి సౌమ్య, జ్యోతినగర్‌, కరీంనగర్‌

యైటింక్లయిన్‌కాలనీ (రామగుండం): రామగుండం కార్పొరేషన్‌ యైటింక్లయిన్‌కాలనీలో నివాసం ఉంటున్న బీజీపీ పట్టణ అద్యక్షుడు ఆకుల శశికుమార్‌, అతడి తమ్ముడు అరుణ్‌కుమార్‌ సోదరి హారిక ఆరేళ్లుగా లండన్‌లో ఉంటున్నారు. గతేడాది హారిక రాఖీ పండుగకు యైటింక్లయిన్‌కాలనీకి వచ్చి సోదరులకు రాఖీ కట్టారు. ఈసారి రావడం కుదరకపోవడంతో పండుగకు ఒకరోజు ముందుగానే ఇంటికి చేరేలా ప్రైవేట్‌ కొరియర్‌ ద్వారా రాఖీలు పంపించినట్లు శశికుమార్‌ తెలిపారు.

భారీగా రాఖీల బట్వాడా

అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్లది అనురాగబంధం. రక్తం పంచుకొని పుట్టినవారిది విడదీయలేని, జీవితాంతం తరిగిపోని ఆప్యాయత బంధం. ఎక్కడ ఉన్నా పరస్పరం యోగక్షేమాలు ఆలోచించి, ఆత్మీయత పంచుకునే ఈ బంధాన్ని శాశ్వతంగా నిలిపేది రక్షాబంధనం. సోదరి మణుల అనుబంధానికి ప్రతీక అయిన రక్షా బంధన వేడుకను శనివారం జరుపుకోనున్న నేపథ్యంలో పలు కథనాలు..

ఈసారి పోస్టు ద్వారా దూరప్రాంతల్లో ఉన్నవారికి సుమారు 1,100 పైగా రాఖీలు కరీంనగర్‌ డివిజన్‌ పరిధిలో పోస్టు ద్వారా పంపారు. కరీంనగర్‌ పోస్టల్‌ డివిజన్‌లో మహిళలు భారీగా రాఖీలు పోస్టు చేయడం మంచి పరిణామం. దూర ప్రాంతాల్లో ఉండే సోదరీ, సోదరుల అనుబంధానికి పోస్టల్‌ శాఖ వేదిక కావడం సంతోషంగా ఉంది.

– కె.శివాజి, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీసెస్‌, కరీంనగర్‌ డివిజన్‌

‘రాఖీ’ మిఠాయి

పెద్దపల్లిరూరల్‌: రాఖీ పండుగరోజు ప్రతీ ఆడపడుచు తమ పుట్టింటికి వచ్చి అన్నాతమ్ముళ్లకు రాఖీ కట్టి మిఠాయి తినిపించి నోరు తీపి చేయడం ఆనవాయితీగా వస్తోంది. శనివారం రాఖీ పండుగ కోసం జిల్లాలోని స్వీట్‌హౌజ్‌ల నిర్వాహకులు వైరెటీలలో మిఠాయిలు తయారు చేసి అమ్మకాలకు సిద్ధం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు గోదావరిఖని, రామగుండం, సుల్తానాబాద్‌, మంథని, పలు ప్రాంతాల్లో 150 వరకు స్వీట్‌హౌజ్‌లు ఉన్నాయి. అందులో కొన్ని స్వీట్‌హౌజ్‌లకు మంచి పేరుండడంతో ఆయా దుకాణాల్లోనే కొనేందుకు జనం ఎగబడుతుంటారు. సాధారణ రోజుల్లో తయారు చేసే పరిమాణం కన్న పండుగ వేళ కొంత ఎక్కువగా తయారు చేస్తున్నామని మిఠాయి దుకాణ యజమాని ఒకరు తెలిపారు.

రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తం

సోదరులకు రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తం. అందుకే రాఖీతో పాటు స్వీట్‌హౌజ్‌లో మిఠాయిలు కొంటాం. రకరకాల స్వీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా పలురకాల కంపెనీల స్వీట్లు కిరాణ దుకాణాల్లో దొరుకుతాయి. పల్లె ప్రజలకు ఇవి కూడా అందుబాటులో ఉంటున్నాయి.

– టి.స్వప్న, అప్పన్నపేట, పెద్దపల్లి

కథలాపూర్‌(వేములవాడ): ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాల్లో ఉంటున్నవారు దసరా పండుగకు స్వగ్రామానికి రావాలని అనుకుంటారు. మా చెల్లె సునీత మేడిపెల్లి మండలం రాగోజిపేట గ్రామంలో ఉంటుంది. ఆమెతో రాఖీ కట్టించుకోవాలని ఇటీవలే అబుదాబి దేశం నుంచి స్వగ్రామం భూషణరావుపేటకు వచ్చిన. రాఖీ పండుగపూట కుటుంబసభ్యులతో ఆనందోత్సవాల మధ్య గడపాలని నెలరోజుల ముందే వచ్చా.

– కూన చిన్నయ్య, ఎన్‌ఆర్‌ఐ, భూషణరావుపేట, కథలాపూర్‌

గిరాకీ ఎక్కువగానే ఉంటది

రోజువారీ అమ్మకాల కన్న రాఖీపండుగకు గిరాకీ ఎక్కువగానే ఉంటది. వైరెటీలలో స్వీట్లు తయారు చేస్తాం. ఎవరి అభిరుచులను బట్టి వారు ఆయా రకాల స్వీట్లు తీసుకెళ్తారు. పంద్రాగస్టు, రిపబ్లిక్‌ డే సమయాల్లో స్వీట్లు అవసరమున్న వారు ముందస్తుగా ఆర్డర్‌ ఇస్తుంటారు. కానీ, రాఖీ పండగ కోసం అప్పటికప్పుడే వచ్చి అందుబాటులో ఉన్నవి తీసుకెళ్తారు.

– నితిన్‌ఖత్రీ, స్వీట్‌హౌజ్‌ నిర్వాహకుడు, పెద్దపల్లి

‘అక్కా.. తమ్ముడు అంటూ చిన్నప్పటి నుంచి వృద్ధాప్యంలోనూ పలకరించుకుంటున్నాం. సెల్‌ఫోన్‌ పుణ్యమానీ రెండు రోజులకోసారి యోగాక్షేమాలు తెలుసుకుంటున్నాం. అక్కకు 80 ఏళ్లు అయినా ఆమె చేతితో రాఖీ కట్టించుకుంటేనే సంతృప్తి ఉంటుంది’ అని కథలాపూర్‌ మండలం భూషణరావుపేటకు చెందిన 75 ఏళ్ల ఉశకోల శంకరయ్య అన్నారు. మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌లో శంకరయ్య అక్క 80 ఏళ్ల చిలివేరి భాగ్యమ్మ నివాసం ఉంటుంది. ఆమె నడవలేని స్థితిలో ఉన్నా ఏటా తాను సైకిల్‌పై భూషణరావుపేట నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని ఆత్మనగర్‌కు వెళ్లి అక్కతో రాఖీ కట్టించుకుంటానని శంకరయ్య తెలిపారు.

– ఉశకోల శంకరయ్య, భూషణరావుపేట, కథలాపూర్‌

ఛత్తీస్‌గఢ్‌ వెళ్తున్నా..

ఈసారీ అమెరికాలోనే..

జేబీఎస్‌కు అదనపు బస్సులు

ఎల్లలు దాటిన సోదరి ప్రేమ

నెలరోజుల ముందే గ్రామానికి..

రాఖీ కోసం సైకిల్‌పై..

నాకు నీడగా.. 1
1/12

నాకు నీడగా..

నాకు నీడగా.. 2
2/12

నాకు నీడగా..

నాకు నీడగా.. 3
3/12

నాకు నీడగా..

నాకు నీడగా.. 4
4/12

నాకు నీడగా..

నాకు నీడగా.. 5
5/12

నాకు నీడగా..

నాకు నీడగా.. 6
6/12

నాకు నీడగా..

నాకు నీడగా.. 7
7/12

నాకు నీడగా..

నాకు నీడగా.. 8
8/12

నాకు నీడగా..

నాకు నీడగా.. 9
9/12

నాకు నీడగా..

నాకు నీడగా.. 10
10/12

నాకు నీడగా..

నాకు నీడగా.. 11
11/12

నాకు నీడగా..

నాకు నీడగా.. 12
12/12

నాకు నీడగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement