
ఆకట్టుకున్న జోయాలుక్కాస్ బ్రిలియెన్స్ డైమండ్ జ్యువెల
కరీంనగర్ కల్చరల్: కరీంనగర్‌లోని జోయాలుక్కాస్ షోరూమ్‌లో శుక్రవారం నిర్వహించిన బ్రిలియెన్స్ డైమండ్ జ్యువెలరీ షో ఆకట్టుకుంది. ప్రత్యేకమైన డిజైన్స్, స్లయిల్స్ ఉన్న డైమండ్లు ఆకట్టుకున్నాయి. జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జాయ్ అలూక్కాస్ మాట్లాడుతూ.. మేము బ్రిలియెన్స్ డైమండ్ జ్యువెలరీ షోను కరీంనగర్‌కు తీసుకురావడానికి ఎంతో సంతోషిస్తున్నామన్నారు. జ్యువెలరీలో సుసంపన్నమైన అభిరుచితో ఇది ఒక గమ్యస్థానం, ఆధునికత–స్లయిల్‌ను చూపించే కలక్షన్‌ను మేము సృష్టిస్తామని అన్నారు. ఇది అందం, భావోద్వేగం, వ్యక్తిత్వం ప్రదర్శనన్నారు. ప్రత్యేకమైన ఆఫర్‌గా కస్టమర్లకు ఈ షో సమయంలో రూ.లక్ష అంతకంటే ఎక్కువగా ప్రతి డైమండ్ జ్యువెలరీ కొనుగోలుతో ఉచితంగా ఒక గ్రాము గోల్డ్ కాయిన్‌ను ఇస్తామని అన్నారు. ఎగ్జిబిషన్ జోయాలుక్కాస్ కరీంనగర్ షోరూంలో ఈనెల 24 వరకు జరుగుతుందని తెలిపారు.