
కరీంనగర్
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025
మీరు సెల్ఫీ పంపించాల్సిన ఫోన్ నంబర్
85007 86474
వరలక్ష్మీ..
నమోస్తుతే
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా నగరంలోని ఆలయాలు మహిళలు, భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, వ్రతాలు, వాయినాలతో సందడిగా మారాయి. వరలక్ష్మీ రావమ్మా అంటూ మహిళలు భక్తితో నోముకున్నారు. నివాసాల్లోనూ అమ్మవారిని కొలువుంచి ప్రత్యేకపూజలు చేశారు. సుహాసినులను ఆహ్వానించి పసుపు, కుంకుమ, పప్పు బెల్లాలు, ఫల, తాంబూలాలు, వస్త్రాలు వాయినాలుగా ఇచ్చారు. ఆలయాల్లో అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయం భక్తులతో పోటెత్తింది. జ్యోతినగర్ హనుమాన్ సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి ఒడిబియ్యం, గాజులు, పసుపు, కుంకుమ, చీరలు సమర్పించారు. – కరీంనగర్ కల్చరల్

కరీంనగర్

కరీంనగర్

కరీంనగర్

కరీంనగర్