
చేనేత గౌరవం ఎప్పటికీ తగ్గదు
కరీంనగర్: చేనేత వస్త్రాల గౌరవం ఎప్పటికీ తగ్గేది కాదని, నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. జాతీయ చేనే త దినోత్సవం సందర్భంగా చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు నేత కార్మికులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ర్యాలీని ప్రా రంభించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని చేనేత కార్మికులకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచిత వైద్య పరీక్షలు చేయిస్తామన్నా రు. అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. జిల్లా నుంచి చేనేత పురస్కారాలు అందుకున్న పలువురిని సన్మానించారు. చేనే త వస్త్రాల ప్రదర్శనను తిలకించారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు విద్యాసాగర్, పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షుడు వాసాల రమేశ్ పాల్గొన్నారు.
తల్లిపాలు అమృతం లాంటివి
తల్లిపాలు అమృతంతో సమానమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో కళాభారతిలో తల్లిపాల ప్రయోజనాలపై ఏర్పాటుచేసిన తల్లులు, స్వయం సహాయక సభ్యుల అవగాహన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పుట్టిన బిడ్డకు గంటలోపు తప్పనిసరిగా తల్లిపాలు పట్టించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ వారం రోజులుగా జిల్లాలో తల్లిపాల ఆవశ్యకత గురించి తెలియజేశామన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ మాట్లాడుతూ బిడ్డకు కనీసం ఏడాది పాటు తల్లిపాలు ఇవ్వాలని అన్నారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, మెప్మా పీడీ వేణుమాధవ్, సీడీపీవో సబిత పాల్గొన్నారు.
నేత కార్మికుల సంక్షేమానికి కృషి
కలెక్టర్ పమేలా సత్పతి