
కారును ఢీకొట్టిన బస్సు
● నలుగురికి గాయాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి శివారులోని కోళ్లఫాం వద్ద శనివారం ఆర్టీసీ బస్సు, కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నపూర్‌కు చెందిన రాజు, మహేశ్, దేవేందర్, మణికంఠ కారులో కామారెడ్డికి వెళ్తున్నారు. ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న సిరిసిల్ల ఆర్టీసీ డిపో బస్సు బైక్‌ను తప్పించబోయి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.