
వృద్ధుడి ఆత్మహత్య
గంగాధర: మండలంలోని మధురానగర్‌లో నివాసం ఉంటున్న అల్లకుంట గంగారాం(70) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన గంగారాం మధురానగర్‌లో తన పెద్ద కొడుకు వద్ద ఉంటున్నాడు. ఐదేళ్ల వ్యవధిలో భా ర్య, కూతురు, చిన్న కుమారుడు చనిపోయా రు. అప్పటినుంచి మద్యానికి బానిసయ్యా డు. శుక్రవారం ఇంటినుంచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు పలుచోట్ల గాలించినా కనిపించలే దు. శనివారం ఉదయం పెద్దకొడుకు శ్రీనివాస్ ఇంటి షట్టర్ తెరిచి చూడగా వెంటి లేటర్‌కు ఉరి వేసుకొని మృతి చెంది కనిపించాడు. శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో ఒకరు..
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం భరించలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన గూడ బాలేశ్వర్‌రెడ్డి(53) అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్నాడు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలు వెంటాడాయి. రెండేళ్ల క్రితం కుమారుడు శ్రీకర్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. భార్య మమత సిరిసిల్లలో ఆశకార్యకర్తగా పనిచేస్తుండగా, తల్లి వసంత ఊరెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలేశ్వర్‌రెడ్డి శనివారం ఉరివేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
జ్వరంతో బాలుడి మృతి
● సిరిసిల్లలో పండుగ పూట విషాదం
సిరిసిల్ల క్రైం: రాఖీ పండుగ రోజు ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. జ్వరంతో బాధపడుతున్న చిన్నారి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌కు చెందిన ఆటో కార్మికుడు ఎర్రం బాలయ్య, మంజుల దంపతుల కుమారుడు అశ్విన్ సర్దాక్(6) మూడు రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్నాడు. సర్దాక్‌ను తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స చేసినా జ్వరం తగ్గకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్ సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. వెంటనే కరీంనగర్‌లోని ప్రైవేట్ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించగా శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

వృద్ధుడి ఆత్మహత్య