
రోడ్డు ప్రమాదంలో సీడ్ వ్యాపారి మృతి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని మంకమ్మతోటలో ఉన్న కొత్తలేబర్ అడ్డా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీడ్ వ్యాపారి మృతిచెందగా అతని భార్యకు గాయాలయ్యాయి. టూటౌన్ సీఐ సృజన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పెగడపల్లి మండలం నామాపూర్‌కు చెందిన చాడ కిషన్‌రెడ్డి(57) సీడ్ వ్యాపారం చేస్తూ.. కరీంనగర్‌లోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి తన భార్య రమాదేవితో కలిసి బైక్‌పై మంకమ్మతోట నుంచి జ్యోతినగర్ వెళ్తున్న క్రమంలో వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో కిషన్‌రెడ్డి కిందపడి స్పృహ కోల్పోయాడు. అతని భార్య తలకు, కాళ్లకు గాయాలు కావడంతో ఇద్దరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కిషన్‌రెడ్డి మృతిచెందాడు. మృతుడి సమీప బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కిషన్‌రెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉండగా ఆమెరికాలో ఉంటున్నారు. వారు వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరుగుతాయని తెలిసింది.
ఆగిఉన్న వాహనాన్ని ఢీకొని యువకుడు..
ముస్తాబాద్(సిరిసిల్ల): చెల్లితో రాఖీ కట్టించుకున్న యువకు డు ఉత్సాహంగా ఇంటికి చేరే క్రమంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాన్ని ఢీకొట్టి దుర్మరణం చెందాడు. ఏఎస్సై అశోక్‌కుమార్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మెయిన్ రోడ్డులో హన్‌మాన్ ఆలయ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన బోరుబండిని శనివారం రాత్రి బైక్ ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న పోతుగల్‌కు చెందిన కొప్పు నరేశ్(26) తీవ్రంగా గాయపడ్డాడు. కడుపులో తీవ్ర గాయాలు కాగా పేగులు బయటపడ్డాయి. చుట్టుపక్కల వారు 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో నరేశ్‌ను సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరేశ్ మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టినట్లు ఏఎస్సై అశోక్‌కుమార్ తెలిపారు.