భూ భారతి.. కాసులకే హారతి | - | Sakshi
Sakshi News home page

భూ భారతి.. కాసులకే హారతి

Aug 8 2025 8:53 AM | Updated on Aug 8 2025 8:53 AM

భూ భా

భూ భారతి.. కాసులకే హారతి

● డబ్బులిస్తేనే పరిశీలన.. పరిష్కారం ● లేదంటే కొర్రీలతో దాటవేసే ప్రయత్నం ● జిల్లాలో పలు చోట్ల మామూళ్ల దందా ● పరిశీలన సమాచారమే లేక రైతుల అయోమయం

మానకొండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు భూమిని భూ సేకరణలో ప్రభుత్వం వారు తీసుకున్నారు. తీసుకున్న భూమి కన్నా ఎక్కువగా రికార్డు నుంచి తొలగించారు. భూ భారతిలో దరఖాస్తు చేస్తే గతంలో పనిచేసిన ఆర్‌ఐ బేరసారాలకు దిగాడు. పరిష్కారం చేపిస్తానని రూ.20వేలు వసూలు చేయగా, పని అవుతోందని దాటవేస్తున్నాడు. ఇది కేవలం ఈ ఒక్క రైతే కాదు జిల్లావ్యాప్తంగా వేలసంఖ్యలో బాధిత రైతులు ఇబ్బంది పడుతున్నారు.

కరీంనగర్‌ అర్బన్‌: భూ భారతి అధికారుల తీరుతో అభాసుపాలవుతోంది. భూ సమస్యల్లేని రా ష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం రూపొందించగా పలువురు రెవెన్యూ అధి కారులు బేరసారాలకు దిగుతుండటం విమర్శలకు తావిస్తోంది. భూ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి భూ భారతి కార్యక్రమాన్ని చేపట్టింది. రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి జిల్లావ్యాప్తంగా 29,426 దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులను ఈ నెల 15లోగా పరిష్కరించాలని ప్రభుత్వం స్పష్టం చేయగా పావు వంతు కూడా పరిష్కారం కాలేదని తెలుస్తోంది. రెవెన్యూ సిబ్బంది చేయి తడిపినవారికే పెద్దపీట వేస్తుండగా బేరం కుదరనివారిని పక్కనబెడుతున్నట్లు సమాచారం.

పరిశీలిస్తున్నారా.. సమాచారమేది?

ప్రతి మండలంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి రెండు బృందాలు ఏర్పాటు చేశారు. ఆరు మాడ్యూళ్లలో 33 ఐచ్చికాలను పొందుపరచగా వీటిపై అవగాహన కోసం ఇప్పటికే గ్రామాల్లో సదస్సులు నిర్వహించారు. దరఖాస్తుల పరిష్కారంలో ఏ గ్రామానికి రెవెన్యూ అధికారులు వెళ్తున్నారు..? మోకాపై పరిశీలిస్తున్నారా? అంటే స్పష్టత లేదని రైతులు వాపోతున్నారు. గ్రామాల్లో టాంటాం చేయాల్సి ఉండగా ఆ దిశగా చర్య లే లేవని, అధికారులు ఎపుడొస్తున్నారో, ఎప్పుడెళ్తున్నారో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిష్కారమయ్యే సమస్యలను తొక్కి పెడుతూ.. అమ్యామ్యాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారే ప్రమాదముంది.

29,426 అర్జీలు.. 30 రకాల సమస్యలు

జిల్లాలో 29,426 అర్జీలు స్వీకరించగా 30 రకాల సమస్యలపై ఆన్‌లైన్‌ చేశారు. సాదాబైనామాతో భూమి హక్కుల కోసం, పాసుపుస్తకాల్లో తప్పులు, పాత పాసుపుస్తకం నుంచి కొత్తదాంట్లో భూమి నమోదుకాలేదని, విస్తీర్ణం, భూమి స్వభావం, హక్కు రకం తదితర అంశాల్లో సమస్యలున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూముల హక్కుల నమోదుకు అర్జీలు అందాయి. పెండింగ్‌ మ్యుటేషన్‌, డీఎస్‌ పెండింగ్‌, భూ విస్తీర్ణంలో తేడాలు సరిచేయడం, నిషేధిత జాబితా నుంచి తొలగించడం, ఇనామ్‌– ఓఆర్సీ జారీ చేయడం, వారసత్వ భూ మార్పిడి, భూ సేకరణకు సంబంధించి అర్జీలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. వీటిని రెవెన్యూ అధికారులు క్రోడీకరించి మాడ్యూళ్ల వారీగా విడదీశారు. తొలుత రెవెన్యూ రికార్డులు క్షుణ్ణంగా తనిఖీ చేసి తరువాత గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి భూమి భౌగోళిక హద్దుల్ని నమోదు చేయనున్నారు. ముందు దరఖాస్తుదారులకు నోటీసులు అందజేసి వారి సమక్షంలోనే సర్వేయర్‌, రెవెన్యూ బృందాలు పరిశీలించాలి. పట్టాదారు పాసుపుస్తకాల్లో రైతుల వివరాలు తప్పుగా నమోదైతే వాటిని గుర్తించి వెంటనే సరి చేయనుండగా సదరు వివరాలను రెవెన్యూ సెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌(ఆర్‌ఎస్‌ఆర్‌)లో సవరణ చేయాలి. ఇతర సమస్యల వివరాలను దరఖాస్తుకు జోడించి తహసీల్దారు, సదరు అధికారి ద్వారా ఆర్డీఓకు నివేదించాలి. కానీ ఏం జరుగుతుందో.. ఎక్కడ అధికారులుంటున్నారో తెలియడం లేదన్నది కర్షకుల మాట. కాగా ఎవరికి డబ్బులు ఇవ్వవద్దని, భూ భారతిలో ప్రతి సమస్య పరిష్కారమవుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో వచ్చిన మొత్తం

దరఖాస్తులు: 29,426

సాదాబైనమా: 10,456

పీవోటీ: 958, అప్పీల్స్‌: 2,916

ఎఫ్‌ లైన్‌: 278

నోషనల్‌ ఖాతా టు పట్టా: 194

నాలా ఇష్యూస్‌: 187, అసైన్‌మెంట్‌: 183

హౌజ్‌సైట్‌ పీపీబీ: 111

భూ భారతి.. కాసులకే హారతి1
1/1

భూ భారతి.. కాసులకే హారతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement