
పండుగ సందడి
విద్యానగర్(కరీంనగర్): శుక్రవారం వరలక్ష్మీ వ్రతం.. శనివారం రాఖీ పండుగ సందర్భంగా నగరంలోని ప్రధాన మార్కెట్ గురువారం కిక్కిరిసింది. మధ్యాహ్నం నుంచే మార్కెట్లో రద్దీ నెలకొనగా.. టవర్ సర్కిల్ ప్రాంతంలో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సందడి కనిపించింది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూజా సామగ్రి దుకాణాలు రద్దీగా మారాయి.
కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూల ధరలు ఆకాశాన్ని అంటాయి. అమ్మవారి ప్రతిమలు, గాజులు, పసుపు, కుంకుమ, తదితర వస్తువులను కొనుగోలు చేస్తూ.. మహిళలు బీజీగా కనిపించారు. శనివారం రాఖీ పండుగ కోసం పలువురు ముందస్తుగానే రాఖీలు కొనుగోలు చేశారు. డిజైన్లను బట్టి రూ.10 నుంచి రూ.100కు పైగా ధర పలికాయి.

పండుగ సందడి