ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు

Oct 19 2024 8:12 AM | Updated on Oct 19 2024 9:36 AM

ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు

ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు

పెద్దలను ఒప్పించి ప్రేమపెళ్లి

గొల్లపల్లి: ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో యువకుడు. ఈ ఘటన గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌లో చోటుచేసుకుంది. లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన మ్యాట్నీ మల్లేశం, లత దంపతుల కొడుకు శ్రీనివాస్‌.. మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన బాసవేని శంకరయ్య, సుశీల దంపతుల కుమారుడు (ట్రాన్స్‌జెండర్‌) అంజలి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 

శ్రీనివాస్‌ ఉపాధి నిమిత్తం కొన్నాళ్లు గల్ఫ్‌ వెళ్లాడు. స్వగ్రామానికి రాగానే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులు, బంధువులను ఒప్పించి బుధవారం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. డీజే చప్పుళ్ల మధ్య ట్రాన్స్‌జెండర్లు డ్యాన్స్‌లతో అదరగొట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement