నడుము విరిచే | - | Sakshi
Sakshi News home page

నడుము విరిచే

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

శుక్రవారం శ్రీ 13 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 సాధారణ నిధులతో టెండర్లు స్పీడ్‌ బ్రేకర్ల పేరిట నిధుల దుర్వినియోగం

న్యూస్‌రీల్‌

కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలి

ఒకే పనికి రెండుసార్లు టెండర్లు

స్మార్ట్‌ సిటీలో స్పీడ్‌ బ్రేకర్ల ఏర్పాటుకు టెండర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే వాహనదారులకు ఇబ్బందులు రోడ్ల మరమ్మతులను పట్టించుకోని అధికారులు ఒకే పనికి రెండుసార్లు టెండర్లు పిలిచిన వైనం అధికారుల తీరుపై సామాన్యుల ఆగ్రహం

శుక్రవారం శ్రీ 13 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

స్మార్ట్‌ సిటీగా రూపాంతరం చెందుతున్న కరీంనగర్‌లో ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు కల్పించాల్సిన అధికారులు.. స్పీడ్‌ బ్రేకర్ల ఏర్పాటుపై చూపుతున్న శ్రద్ధ విమర్శలకు తావిస్తోంది. గుంతలమయంగా మారిన రోడ్ల మరమ్మతులను పట్టించుకోని యంత్రాంగం.. స్పీడ్‌ బ్రేకర్ల నిర్మాణానికి మాత్రం టెండర్లు పిలవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా పలుచోట్ల స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటి కారణంగా వాహనాలు దెబ్బ తినడంతోపాటు నడుము నొప్పులు వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. తాజాగా బల్దియా పిలిచిన టెండర్ల ద్వారా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా స్పీడ్‌ బ్రేకర్లు నిర్మిస్తే వాహనదారుల కష్టాలు మరింత పెరుగుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అస్తవ్యస్త రహదారులతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఇవి అదనపు భారంగా మారనున్నాయని అంటున్నారు.

కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీకే) సాధారణ నిధుల వినియోగంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఒకే పనికి టెండర్లు పునరావృతమైన ఘటనలు వెలుగుచూసినా.. మళ్లీ అలాంటి పరిణామాలే చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బల్దియా అధికారులు నిధులను సరైన రీతిలో ఖర్చు చేయడం లేదని పలువురు సీనియర్‌ కార్పొరేటర్లు అభిప్రాయపడుతున్నారు. వివిధ పండుగల సందర్భంగా ఫెయిర్స్‌ అండ్‌ ఫెస్టివల్స్‌ స్కీం కింద కోట్లాది రూపాయలు రోడ్ల ప్యాచ్‌వర్క్‌ల కోసం ఖర్చు చేస్తున్నప్పటికీ.. నగరంలోని అనేక రహదారులు గుంతలమయంగా మారి ఉండటం గమనార్హం. వాటి మరమ్మతులపై దృష్టి సారించని అధికారులు.. స్పీడ్‌ బ్రేకర్ల నిర్మాణానికి టెండర్లు పిలవడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల దుస్థితిని పట్టించుకోకుండా ఈ పనులకు ప్రాధాన్యమివ్వడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు.

మున్సిపల్‌ సాధారణ నిధులను ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు వినియోగించాల్సి ఉంటుంది. అయితే బల్దియా అధికారులు స్పీడ్‌ బ్రేకర్ల ఏర్పాటుకు నిధులు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రధాన రహదారులపై ప్రమాణాలకు అనుగుణంగా లేని మందపాటి పేవ్‌మెంట్‌ మార్కింగ్‌లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అంతర్గత రహదారుల్లోనూ స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని చోట్ల రబ్బరుతో, మరికొన్ని చోట్ల సిమెంట్‌తో స్పీడ్‌ బ్రేకర్లు నిర్మించేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. వీటి కోసం దాదాపు రూ.40 లక్షల వరకు మున్సిపల్‌ సాధారణ నిధులు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన, కాలనీల్లోని అంతర్గత రహదారుల మరమ్మతులకు ప్రాధాన్యమివ్వాల్సింది పోయి.. స్పీడ్‌ బ్రేకర్ల ఏర్పాటుకు టెండర్లు పిలవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ప్రధాన రహదారులపై మందపాటి పేవ్‌మెంట్‌ మార్కింగ్‌ల కారణంగా ప్రజలు వెన్నెముక, మెడ నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు అంతర్గత రహదారుల్లోనూ స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే సమస్యలు మరింత తీవ్రమవుతాయి. సామాన్యుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను అధికారులు విరమించుకోవాలి. ఈ విషయంలో కలెక్టర్‌ జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

– అన్నెమల్ల సురేశ్‌

ఖాన్‌పురాలోని టాటా ఆసుపత్రి వద్ద వరద కాలువకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసేందుకు 2024–25లో రూ.2.95 లక్షల మున్సిపల్‌ సాధారణ నిధులతో టెండర్‌ పిలిచారు. ఈ పనిని ఓ ఏజెన్సీ దక్కించుకుంది.

ప్రస్తుతం అదే ప్రాంతంలోని (పాత 4వ డివిజన్‌, ప్రస్తుత 31వ డివిజన్‌) వరద కాలువకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసేందుకు మరోసారి టెండర్‌ పిలిచారు. రూ.1.65 లక్షల అంచనా వ్యయంతో పిలిచిన ఈ టెండర్‌ ప్రస్తుతం ప్రక్రియలో ఉంది.

గతంలోనే పనికి సంబంధించిన టెండర్‌ పూర్తయి, ఏజెన్సీకి అప్పగించినప్పుడు.. అదే పనికి ఏడాదిలోపే మరోసారి టెండర్‌ ఎలా పిలిచారు? ఒకే పనికి రెండుసార్లు సాంకేతిక, పరిపాలనా అనుమతులు ఎలా మంజూరయ్యాయి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో మార్కండేయనగర్‌లోనూ ఒకే పనిని ఎంజీఎఫ్‌, యూఐడీఎఫ్‌ నిధులతో చేపట్టిన సందర్భంలో టెండర్‌ పునరావృతమైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement