ప్రభుత్వ బడుల్లో వసతులకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లో వసతులకు పెద్దపీట

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

ప్రభుత్వ బడుల్లో వసతులకు పెద్దపీట ● కరీంనగర్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కొత్తపల్లి(కరీంనగర్‌): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు కరీంనగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. మల్కాపూర్‌, కొత్తపల్లి, చింతకుంట శాంతినగర్‌ ప్రభుత్వ పాఠశాలల్లో రూ.21 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో నిర్మించిన ఆధునిక మరుగుదొడ్లను గురువారం డిప్యూటీ మేయర్‌ సునీల్‌ రావు, స్థానిక కార్పొరేటర్లు కాంతాల జగన్‌రెడ్డి, వాసాల రమేశ్‌, వేముల కవిత చంద్రశేఖర్‌, విప్పల సాయిజ్యోతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లిష్‌ డిక్షనరీలు పంపిణీ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ సహకారంతో పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని వివరించారు. స్మార్ట్‌ సిటీ నిధులతో పాఠశాలల్లో స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌లు, కంప్యూటర్లు, ఫర్నిచర్‌ తదితర సౌకర్యాలు కల్పించామన్నారు. త్వరలోనే పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ జీపీఏ సాధించి కరీంనగర్‌కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్పొరేటర్‌ బండ రమణారెడ్డి, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement