అరవై దాటితే అనర్హులే.. | - | Sakshi
Sakshi News home page

అరవై దాటితే అనర్హులే..

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

అరవై దాటితే అనర్హులే.. జిల్లాలో వివరాలు ఇలా.. ● ప్రభుత్వ ఆదేశాలతో మహిళా సంఘాల్లో మొదలైన ప్రక్రియ ● వారి స్థానంలో కొత్తవారికి అవకాశం

జిల్లాలో వివరాలు ఇలా..

కరీంనగర్‌అర్బన్‌: మహిళా సంఘాలను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంఘాల్లో ఉన్నవారు యాక్టివ్‌గా ఉండేలా కొత్తవారికి అవకాశమిస్తూనే 60 ఏళ్ల వయసు దాటిన వారిని తొలగించాలని నిర్ణయించింది. మహిళలు ఆర్థిక పరిపుష్టిని సాధించేందుకు ప్రభుత్వం స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. సంఘాల్లో ఉన్న అతివలు రుణాలు పొంది వ్యాపారాలు చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన సభ్యులను సంఘాల నుంచి తొలగించి వారి స్థానంలో కొత్తవారిని చేర్పించుకోవాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో 24వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా 2.50లక్షల మంది సభ్యులు ఉన్నారు. మహిళా సంఘాలకు అర్హతను బట్టి రూ.50 వేల నుంచి రూ.5లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. బ్యాంకు లింకేజీ, పావలా వడ్డీ రుణాలు, సీ్త్రనిధి, వ్యక్తిగత రుణాలతో సభ్యులు ఆర్థికంగా ఎదుగుతున్నారు.

18 శాతానికి పైగా సభ్యులు

సంఘాల్లో 60 ఏళ్లు దాటినవారు సుమారు 10శాతం మంది సభ్యులు ఉన్నారు. పని చేయలేని వారికి ఆదాయం లేకపోవడంతో రుణాలు సకాలంలో చెల్లించడం లేదు. దీంతో డీఫాల్ట్‌గా మారి అందరూ నష్టపోవాల్సి వస్తోంది. వయసు దాటినవారిలో ఎక్కువ మంది అక్షరాస్యులు కాదు. వయోభారంతో సమావేశాలకు హాజరు కాలేకపోతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవడంలోనూ విఫలమవుతున్నారు. ఇలా సంఘాల్లో వీరితో ఎదురవుతున్న సమస్యలు గమనించిన ప్రభుత్వం తొలగించాలని నిర్ణయించిందని అధికారులు చెబుతున్నారు.

ఆధార్‌ ఆధారంగా గుర్తింపు

ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కావడంతో డీఆర్డీవో సిబ్బంది క్షేత్రస్థాయిలో ఆధార్‌ కార్డులో వివరాల ఆధారంగా గుర్తిస్తున్నారు. ఒకవేళ వయసు దాటిన వారు సంఘాల్లో కొనసాగినా ఎలాంటి రుణాలు రావు. 60 ఏళ్లు దాటిన మహిళలను సంఘం నుంచి తొలగించాలని నిబంధన పెట్టడంపై సభ్యులు అభ్యంతరం తెలుపుతున్నారు. రుణాలు తీసుకున్న వారిని తొలగిస్తే వారి వాయిదాలు చెల్లింపునకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణాల చెల్లింపు భారం సంఘంలో మిగతా సభ్యులపై పడుతుందని పేర్కొంటున్నారు.

స్వయం సహాయక సంఘాలు: 24,370

సభ్యులు: 2,50,312

60 ఏళ్లు నిండినవారు: 25,180(అంచనా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement