బీఆర్‌ఎస్‌తోనే అన్నివర్గాలకు న్యాయం : గంగుల కమలాకర్‌ | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌తోనే అన్నివర్గాలకు న్యాయం : గంగుల కమలాకర్‌

Apr 4 2024 1:35 AM | Updated on Apr 4 2024 10:37 AM

- - Sakshi

ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌

కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీగా వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించా లని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పిలు పునిచ్చారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భా గంగా కిసాన్‌నగర్‌ 3,25వ డివిజన్‌లో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఎమ్మెల్యే కమలాకర్‌, వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక స్మార్ట్‌సిటీ నిధులతో పాటు సీఎం హామీ నిధులు రూ.360 కోట్లతో కరీంనగర్‌ నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దామని అన్నారు.

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీల మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టి బీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని ప్రజలను కోరా రు. మేయర్‌ సునీల్‌రావు, బీఆర్‌ఎస్‌ నాయకులు చల్ల హరిశంకర్‌, ఎడ్ల అశోక్‌, కుర్ర తిరుపతి, కంసాల శ్రీనివాస్‌, కామారపు శ్యాం పాల్గొన్నారు.

ఇవి చదవండి: బీజేపీ ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు?

Advertisement
 
Advertisement
Advertisement