ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. విషాదం! | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. విషాదం!

Mar 21 2024 1:25 AM | Updated on Mar 21 2024 9:43 AM

- - Sakshi

హన్సిక(ఫైల్‌)

ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటన

ఇంటర్‌ విద్యార్థి తెలికుంట హన్సిక మృతి

కరీంనగర్: దుబ్బపల్లి గ్రామ సమీప రాజీవ్‌ రహదారిపై బుధవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి తెలికుంట హన్సిక(17) అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె సోదరుడు భానుప్రకాశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై శ్రావణ్‌ కుమార్‌ కథనం ప్రకారం.. సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన తెలికుంట హన్సిక జూలపల్లి మండలం తెలుకుంటలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్‌ చదువుతోంది. బుధవారం కరీంనగర్‌ విద్యానగర్‌లోని తన బాబాయి ఇంటికి పనిపై వెళ్లింది. బాబాయ్‌ కొడుకు భానుప్రకాశ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై సుల్తానాబాద్‌కు బయలు దేరింది.

ఈక్రమంలో దుబ్బపల్లి వద్ద లారీ వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హన్సిక తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రగాయాలైన భానుప్రకాశ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. కాగా, కూలీ పనులు చేస్తూ తన ఇద్దరు కూతుళ్లను పెంచి పెద్దచేసిన పద్మ.. చేతికి అందివచ్చిన చిన్నకూతురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో కన్నీటిపర్యంతమవుతోంది.

ఇవి చదవండి: మా నాన్న ఎలా చనిపోయాడు?

Advertisement
 
Advertisement
Advertisement