పోచమ్మకు బోనం | - | Sakshi
Sakshi News home page

పోచమ్మకు బోనం

Jul 27 2026 1:36 AM | Updated on Jul 27 2026 1:36 AM

కరీంనగర్‌కల్చరల్‌/మానకొండూర్‌: కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం పోచమ్మతల్లికి బోనాలు తీశారు. మున్నూరు కాపు, పద్మశాలి, రాంపూర్‌ గౌడ్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బోనమెత్తారు. మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఆలయాలకు చేరుకుని అమ్మవారికి సమర్పించారు. ఒడిబియ్యం పోశారు. చింతకుంట, కిసాన్‌నగర్‌, శివాజీనగర్‌, పసులనారాయణ కాలనీ, మార్కండేయనగర్‌, రాంనగర్‌, కోతిరాంపూర్‌ ప్రాంతాల్లోని పోచమ్మ ఆలయాల్లో సందడి నెలకొంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, మున్నూరు కార్పొరేషన్‌ చైర్మన్‌ బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నర్సన్న, డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌రావు పాల్గొన్నారు. మానకొండూర్‌లో మహంకాళమ్మ బోనాలను వైభవంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, తాళ్లపల్లి శేఖర్‌గౌడ్‌, సర్పంచ్‌ తాళ్లపల్లి వర్షిణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement