ఆరుతడి పంటలకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలకు పెద్దపీట

Jul 27 2026 1:36 AM | Updated on Jul 27 2026 1:36 AM

కరీంనగర్‌ అర్బన్‌: ఎల్‌నినో నేపథ్యంలో ఆరుతడి పంటల వైపు రైతులు దృష్టిసారించాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా సూచించారు. జిల్లాలోని అన్ని మండలకేంద్రాల్లోని రైతు వేదికల్లో ఈ నెల 27నుంచి 29వరకు ప్రత్యామ్నాయ పంటల విత్తనమేళా నిర్వహిస్తున్నట్లు వివరించా రు. ఈ మేళాల్లో రైతులకు వివిధ రకాల ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను అందుబాటులో ఉంచడంతో పాటు ఆయా పంటల సాగు విధా నం, విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణ వంటి అంశాలపై వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా చిరుధాన్యాలు, అపరాలు (పప్పుధాన్యాలు), నువ్వులు, ఆముదం, కూరగాయల పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ సూచించారు.

గో సంరక్షణ అందరి బాధ్యత

కరీంనగర్‌కల్చరల్‌: గోసంరక్షణ ప్రతి హి ందువు బాధ్యత అని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సూ చించారు. కరీంనగర్‌లోని శ్రీ వరసిద్ధి వినాయకసేవా సమితి ఆధ్వర్యంలో వైశ్యభవన్‌లో ఆదివారం ప్రవచనాలు వినిపించారు. కోటేశ్వరరావుకు ఎమ్మెల్యే కమలాకర్‌ ఘన స్వాగతం పలికారు. కోటేశ్వరరావు గోమాత ప్రాశస్త్యాన్ని వివరిస్తూ గోవును పూజించడం ఆచారం మాత్రమే కాదని, ప్రకృతి, సమస్త జీవరాశులపై కృతజ్ఞతను వ్యక్తపరిచే భారతీయ సంస్కృతి అని పేర్కొన్నారు. ఆధ్యాత్మికతతో పాటు మానవతా విలువలు పెంపొందేలా కృషి చేయాలని సూచించారు.

స్వభావపూర్ణతోనే బాల సాహిత్యం వికసిస్తుంది

కరీంనగర్‌ కల్చరల్‌: స్వభావపూర్ణతతో కూడిన రచనలే బాలసాహిత్యానికి నిజమైన భూమికగా నిలుస్తాయని నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ దక్షిణ ప్రాంత అధికారి పత్తిపాక మోహన్‌ అన్నారు. కరీంనగర్‌లోని ఫిలిం భవన్‌లో ఆదివారం నిర్వహించిన నలిమెల భాస్కర్‌ రచించిన ‘పిల్ల తెమ్మెరలు’ బాలల పాటల పుస్తక ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బాలసాహిత్యంలో ఆనందం, అనుభూతి ప్రధానమని, బోధన, నీతి, నిజాయితీ సహజంగా అందాలన్నారు. మానేరు తీరం ఎందరో కవులను అందించిందని నలిమెల భాస్కర్‌ కేవలం కవి మాత్రమే కాక గొప్ప మానవతావాది అని కొనియాడారు. ప్రముఖ బాలసాహితీవేత్త వీఆర్‌.శర్మ మాట్లాడుతూ భాస్కర్‌తో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందన్నారు. బాలసాహితీవేత్త గరిపల్లి అశోక్‌, కవులు కూకట్ల తిరుపతి, మాడిశెట్టి గోపాల్‌, అన్నాడి గజేందర్‌రెడ్డి, నంది శ్రీనివాస్‌, కేఎస్‌.అనంతాచార్య, కాండూరి వెంకటేశ్వర్లు, దాస్యం సేనాధిపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement