యాభై ఏళ్లకు.. ఒక్క చోటకు.. | - | Sakshi
Sakshi News home page

యాభై ఏళ్లకు.. ఒక్క చోటకు..

Sep 25 2023 1:12 AM | Updated on Sep 25 2023 10:39 AM

ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు  - Sakshi

ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు

తిమ్మాపూర్‌(మానకొండూర్‌): కరీంనగర్‌ గంజ్‌ హైస్కూల్లో 1973 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఘనంగా జరిగింది. చిన్ననాటి స్మృతులను నెమరేసుకున్నారు. చిన్నపిల్లలుగా వెళ్లినవారు.. మనవలు, మనమరాళ్లను ఎత్తుకుని రావడం ఒకరినొకరు గుర్తుపట్టకపోవడం కనిపించింది.

మళ్లీ నూతనంగా పరిచయం చేసుకున్నారు. చాలామంది పూర్వ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్‌ అయ్యారు. కుటుంబసభ్యులతో రోజంతా ఆటాపాటలతో ఆనందంగా గడిపారు. గంజ్‌ పాఠశాల అభివృద్ధికి తామంతా కృషి చేస్తామని చెప్పారు. 50 ఏళ్ల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

మరణించిన తోటి స్నేహితులు, నాటి ఉపాధ్యాయులకు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, సత్యనారాయణ, రాజేశం, రవూఫ్‌, పూర్వ విద్యార్థులు విశ్వనాథ్‌ బాలకిషన్‌, చంద్రమౌళి, సత్యం, గౌరిశెట్టి రాజేందర్‌, ప్రభాకర్‌, సోమనాథ్‌, లక్ష్మారెడ్డి, అంజయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement