విశిష్ట గాయని ఎస్.జానకి 2004లో సిరిసిల్లకు విచ్చేసిన సందర్భంగా అప్పటి సీఐ పోలీస్ ఉమామహేశ్వరశర్మ ఇంట్లో కలిశాను. సిరిసిల్లలో గడిపిన రోజుల గురించి నాతో చెప్పుకొచ్చారు. ఆమె తండ్రి ఆయుర్వేద వైద్యంలో సిద్ధహస్తులు కావడంతో సిరిసిల్ల సర్ దేశాయి ఇక్కడికి ఆహ్వానించారు. వేంకటేశ్వర ఆలయం వద్ద ఉన్నటువంటి తిమ్మయ్యగారి బంగ్లాలో ఉన్నట్టు చెప్పారు. నా స్నేహితులతో కలిసి చాలాసేపు ముచ్చటించి భోజనం చేసి గడిపిన సమయం మా జీవితంలో మరువలేనిది.
– గుడ్ల రవి, సిరిసిల్ల టౌన్ క్లబ్ మాజీ అధ్యక్షుడు


