● శివారులో వన భోజనాలకు తరలిన గ్రామస్తులు
జమ్మికుంట: ఊరుకు కీడు సోకిందని, అందుకే గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులంతా ఊరు విడిచి వంటలకు వెళ్లిన ఘటన జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని అబాది జమ్మికుంట గ్రామంలో కొన్ని నెలలుగా వరస మరణాలు సంభవిస్తున్నాయి. గ్రామ పెద్దల ఆలోచన చేసి వేద పండితులను సంప్రదించగా.. ఊరి కీడు పోవాలంటే గ్రామస్తులంతా ఊరు వదిలి వంటలకు వెళ్లాలని సూచించారు. 2 రోజుల ముందే గ్రామంలో డప్పు చాటింపు వేయించారు. అందరూ కలిసి గ్రామం అవతల ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వంటలకు వెళ్లారు. చీకటి పడ్డ తర్వాత ఇంటి బాట పట్టారు.


