ఆలయ పరిసరాల్లో మునుల గుహ, కొండల రాయుడి కోట ఉందనే విషయం తెలియక కేవలం స్వామి వారిని దర్శించుకొని తిరిగి వెళ్లిపోయిన. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఆల య ప్రాశస్త్యంతోపాటు పర్యాటక ప్రాంతాల వివరాలు తెలిపే బోర్డులు ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేయాలి. కొండగట్టు అభివృద్ధికి అధికారులు చొరవ చూపాలి. – ఎం.సురేందర్‌నాయక్, హైకోర్టు న్యాయవాది, భక్తుడు
కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఆలయ ప్రాశస్త్యం తెలిసేలా ఆలయ పరిసరాల్లో బోర్డులు ఏర్పాటు చేస్తాం.
– అంజనారెడ్డి, కొండగట్టు ఆలయ ఈవో


