గల్ఫ్‌ వెళ్లేందుకు ఆల్‌ ఫ్రీ | - | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ వెళ్లేందుకు ఆల్‌ ఫ్రీ

Jul 13 2026 1:28 AM | Updated on Jul 13 2026 1:28 AM

ఉద్యోగాల వివరాలు

వేములవాడ: యూఏఈలో ఉద్యోగం చేయాలనుకునే గల్ఫ్‌ అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. ప్రముఖ ఏడీఎన్‌హెచ్‌ క్యాటరింగ్‌ కంపెనీలో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి ప్రముఖ రిక్రూట్‌మెంట్‌ సంస్థ జీటీఎం ఇంటర్నేషనల్‌ ఉచిత నియామకాలను చేపడుతోంది. ఈ ఉద్యోగాలకు వీసా, ఫ్లయిట్‌ టికెట్‌, రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ అంతా ఫ్రీగా నిర్వహించనుందని ప్రకటించింది. క్లీనర్లు, వెయిటర్లు, డ్రైవర్లు, హెవీ వెహికల్‌ మెకానిక్స్‌ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయని సంస్థ ప్రతినిధి చీటి సతీశ్‌రావు ఆదివారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్‌ డాక్యుమెంట్లు, పాస్‌పోర్ట్‌, సీవీలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.

వెయిటర్‌

ఇంటర్వ్యూ తేదీ: జూలై 15, బుధవారం.

జీతం: 1,200 ఏఈడీ(సుమారు రూ.32 వేలు), ఉచిత భోజనం, వసతి, రవాణా.

అర్హత: వెయిటర్‌గా అనుభవం ఉండి ఇంగ్లిష్‌ మాట్లాడడం రావాలి.

వయస్సు: 21 నుంచి 40 సంవత్సరాల్లోపు.

క్లీనర్‌

ఇంటర్వ్యూ తేదీ: జూలై 17, శుక్రవారం.

జీతం: 950 ఏఈడీ(సుమారు రూ.26వేలు), ఉచిత భోజనం, వసతి, రవాణా.

వయస్సు: 19 నుంచి 40 సంవత్సరాల్లోపు.

డ్రైవర్‌

యూఏఈ లైసెన్స్‌, వాలిడిటీ తప్పనిసరి.

లైట్‌ డ్రైవర్‌

జీతం: 1,800 ఏఈడీ(సుమారు రూ.48వేలు).

హెవీ డ్రైవర్‌

జీతం: 2,800 ఏఈడీ(సుమారు రూ.75 వేలు), గది, భోజనం, రవాణా.

హెవీ వెహికల్‌ మెకానిక్స్‌ రంగం

ఇంటర్వ్యూ తేదీ: జూలై 17, శుక్రవారం.

సంబంధిత రంగంలో అనుభవమున్నవారు అర్హులు.

సీనియర్‌ మెకానిక్‌

జీతం: 7,000 ఏఈడీ(రూ.1.90లక్షలకు పైగా).

మెకానిక్‌

జీతం: 3,500 ఏఈడీ(రూ.93వేలకు పైగా).

ఆటో ఎలక్ట్రికల్‌–ఏసీ టెక్నీషియన్‌

జీతం: 2,500 ఏఈడీ(రూ.66వేలకు పైగా).

అసిస్టెంట్‌ మెకానిక్‌

జీతం: 2,100 ఏఈడీ(రూ.56వేలకు పైగా).

డెంటర్‌ టెక్నీషియన్‌(టిన్‌స్మిత్‌)

జీతం: 2,100 ఏఈడీ(రూ.56వేలకు పైగా).

పెయింటర్‌ టెక్నీషియన్‌

జీతం: 2,100 ఏఈడీ(రూ.56వేలకు పైగా).

ఇంటర్వ్యూ వేదికలు

అభ్యర్థులు పైన పేర్కొన్న తేదీల్లో ఉదయం 10 గంటలకు తమకు దగ్గర్లోని జీటీఎం ఇంటర్నేషనల్‌ కార్యాలయాల్లో స్వయంగా హాజరు కావాలి. తమ డాక్యుమెంట్లను gulfjobsgtm@gmail.com మెయిల్‌ చేసి కన్ఫర్మేషన్‌ పొందొచ్చు. ఆర్మూర్‌ 8332013999, నిజామాబాద్‌ 8686860999, జగిత్యాల 8332042299, సిరిసిల్ల 8332017122, సికింద్రాబాద్‌ 8332052299 నంబర్లలో సంప్రదించాలి. ఈ రిక్రూట్‌మెంట్‌ పూర్తిగా ఉచితమని, ఏడీఎన్‌హెచ్‌ క్యాటరింగ్‌ కంపెనీ వీసాల కోసం, టికెట్‌ కోసం లేదా మరే ఇతర ప్రక్రియ కోసమైనా ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే వెంటనే 9989107011 నంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సతీశ్‌రావు కోరారు.

క్యాటరింగ్‌ కంపెనీలో ఉచితంగా వీసా, ఫ్లయిట్‌ టికెట్‌

డబ్బులడిగితే ఫిర్యాదు చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement