ముగ్గురు కొడుకులున్నా చెట్టు నీడే దిక్కు! | Heart warming Incident in Mahabubabad district | Sakshi
Sakshi News home page

ముగ్గురు కొడుకులున్నా చెట్టు నీడే దిక్కు!

Jul 13 2026 3:04 AM | Updated on Jul 13 2026 3:04 AM

Heart warming Incident in Mahabubabad district

కుమారులు ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో గ్రామ సెంటర్‌లోని చెట్టు కింద పడుకున్న సోమనర్సమ్మ

ఆస్తి కోసం 90 ఏళ్ల తల్లిని గెంటేసిన కుమారులు 

మహబూబాబాద్‌ జిల్లాలో ఘటన 

నర్సింహులపేట: ముగ్గురు కొడుకులు న్నా ఆ పండుటాకుకు చెట్టు నీడే దిక్క య్యింది. కొడుకులు ఇంటి నుంచి వెళ్ల గొట్టారని 90 ఏళ్ల వృద్ధురాలు పోలీసు లను ఆశ్రయించిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. వృద్ధురాలు బోగోజు సోమనర్సమ్మకు ముగ్గురు కుమారు లు, ఒక కుమార్తె. వృద్ధాప్యంలో తనకు న్న 25 గుంటల పొలాన్ని పెద్ద కుమారుడు దేవేంద్రచారి తీసుకొని, బాగా చూసుకుంటానని పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకొని ఇంటికి తీసుకెళ్లాడు. రెండేళ్ల తర్వాత ఇంటి నుంచి వెళ్లగొట్టి ఆ భూమిని అమ్ముకున్నాడు. 

అనంతరం రెండో కుమారుడు అనంతచారి వద్దకు వెళ్లింది. తన పేరుమీద ఉన్న నాలుగు గుంటల ఇంటి స్థలంలో దేవేంద్రచారి ఇంటి నిర్మాణం కోసం ముగ్గుపోశాడు. ముగ్గురికి సంబంధించిన ఆ స్థలం పంచుకోవాలని అనంతచారి, మూడో కుమారుడు రవీంద్రచారి అడిగితే పెద్దకుమారుడు ఒప్పుకో లేదు. దీంతో అనంతచారి ఇంట్లో నుంచి తల్లిని పంపించాడు. దిక్కుతోచని స్థితిలో గ్రామ ఆలయ సమీపంలో ఉన్న చెట్టు వద్ద ఉంటున్నానని, ఆస్తి పంపకాల కోసం 90 ఏళ్ల వయస్సులో తనను కుమారులు వెళ్లగొట్టారని ఆమె కన్నీరుమున్నీరైంది. 

పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నట్లు బాధితురాలు తెలిపింది. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని, దూరప్రాంతాల్లో ఉంటున్న ఆమె ముగ్గురు కుమారులు రాగానే కౌన్సెలింగ్‌ ఇస్తామని ఎస్సై బానోతు వెంకన్న తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో ఉంటున్న కూతురు వద్దకు పంపినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement