సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతా రావ్‌ల మధ్య ఇటీవల ఢిల్లీలో జరిగిన గొడవకు సంబంధించి గురువారం గాంధీభవన్‌కు రావాలని పీసీసీ నుంచి పిలుపు వచ్చింది. తొలుత మంత్రితో, తర్వాత ఎమ్మెల్యేతో మాట్లాడాలని నిర్ణయించగా, మంత్రి హాజరుకాలేదని సమాచారం. జుక్కల్ ఎమ్మెల్యే సైతం గాంధీభవన్‌కు వెళ్లలేదని తెలుస్తోంది. దీంతో విచారణ వాయిదాపడినట్లు భావిస్తున్నారు. వివాదం పీసీసీ స్థాయిలో పరిష్కారమవుతుందా లేదా ఏఐసీసీ దగ్గరకు వెళుతుందా అన్నది తేలాల్సి ఉంది.
● ఐదుగురికి తీవ్రగాయాలు
భిక్కనూరు: భిక్కనూరు మండల సమీపంలో ఉన్న ఓ ఫార్మ కంపెనీలో రియాక్టర్ పేలడంతో గురువారం రాత్రి ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురు ఇత ర రాష్ట్రాలకు చెందిన వారు కాగా, మరో ఇ ద్దరు స్థానికులు అని తెలిసింది. గాయపడిన ఐదుగురిని ఫ్యాక్టరీ అధికారులు వెంటనే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం హైదరా బాద్‌కు తరలించారు. ఈ విషయమై భిక్కనూరు పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
పిట్లం(జుక్కల్): గ్రామాల్లో నీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి మురళి పేర్కొన్నారు. పిట్లం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండలస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. వర్షపునీరు భూమిలో ఇంకిపోయేలా ఇళ్లు, ఖాళీ ప్రదేశాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, గ్రామ సర్పంచులు, అధికారులు కలిసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అనంతరం అభివృద్ధి పనులు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వ సేవలపై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాయన్న, తహసీల్దార్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్(జీపీవోస్) యూనియన్ నూతన కార్యవర్గాన్ని గురువారం జిల్లా కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ప్రేమ్, గౌరవ సలహాదారులుగా జి. స్వామి, బి.నరేశ్, అధ్యక్షుడిగా రాజు, ప్రధాన కార్యదర్శిగా జి. శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. నరేశ్, కోశాధికారిగా కె. సత్యం, జాయింట్ సెక్రెటరీగా డి. రాజు, ఉపాధ్యక్షులుగా సిద్ధలింగం, సాయిప్రసాద్, డి. పద్మయ్య, సాయి దాసరి, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా రవి, శ్రవణ్, విజయ్, సలహాదారులుగా ఆర్.బాబు, ప్రభాకర్, ఎన్. సాయికుమార్, ఆర్.శేఖర్, సోషల్ మీడియా కన్వీనర్లుగా ఎ.మధు, ఎస్.అఖిల్ ఎన్నికయ్యారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడతామని నూతన కార్యవర్గ ప్రతినిధులు తెలిపారు.


