భిక్కనూరు: అనారోగ్యంతో బాధపడే వారు తమ జీవన శైలిలో మార్పులు చేసుకుని యో,గా ప్రాణయామం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని సౌత్‌క్యాంపస్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి నారాయణగుప్తా అన్నారు. సౌత్‌క్యాంపస్‌లో మంగళవారం క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలను ముందుగానే గుర్తించడం, సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోవడం ముఖ్యమన్నారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ హరిత లక్కరాజు, అధ్యాపకులు మెహన్‌బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.


