ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డికి చెందిన తోట సాయిప్రసాద్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్కృష్ట సేవా పథకానికి ఎంపికై నట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఇంటిలిజెన్‌న్స్ హెడ్ కానిస్టేబుల్ తోట సాయి ప్రసాద్ 2000 పోలీస్ బ్యాచ్‌కు చెందిన వారన్నారు. గత 25 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో మచ్చలేని సేవలందిస్తున్నారని, పోలీసు శాఖలో ఆయన చూపిన అంకితభావం, అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గౌరవ పథకాన్ని ప్రకటించిందన్నారు. ఈసందర్భంగా సాయిప్రసాద్‌కు కుటుంబ సభ్యులతో పాటు, స్థానికులు అభినందనలు తెలిపారు.


