బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లంక్యాంపులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంగళవారం ఎంపీడీవో ఆనంద్ భూమిపూజ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికసాయంతో పేదలు తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నారు. సర్పంచ్ నర్సవ్వ, ఉప సర్పంచ్ దుర్గాప్రసాద్, ఎంపీవో మ హిబూబ్, పంచాయతీ కార్యదర్శి రాహేలాబేగం, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, హరికృష్ణ, సంజీవులు, వెంకటేశం, అంజనేయులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల అందజేత
దోమకొండ: మండల కేంద్రంలోని వివిధ కాలనీల్లో 44 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంగళవారం మంజూరు పత్రాలను ఎంపీడీవో మధురిమ అందజేశారు. రెండవ విడతలో భాగంగా పలువురికి ఇళ్లు మంజూరు కాగా వారికి ధ్రువపత్రాలు, మరికొందరికి నిర్మాణానికి ముగ్గులు పోశారు. సర్పంచ్ ఐరేని నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమలగౌడ్, హౌసింగ్ ఏఈ లహరి, కార్యదర్శి యాదగిరి, సీతారాం, మధు, స్వామి పాల్గొన్నారు.


