ఆటోపై విరిగిపడిన భారీ వృక్షం | - | Sakshi
Sakshi News home page

ఆటోపై విరిగిపడిన భారీ వృక్షం

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

ఆటోపై విరిగిపడిన భారీ వృక్షం

● ఒకరి మృతి.. నలుగురికి గాయాలు

రుద్రూర్‌: నడుస్తున్న ఆటోపై భారీ వృక్షం ఆకస్మికంగా విరిగిపడటంతో ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బోధన్‌–రుద్రూర్‌ ప్రధాన రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వర్ని మండలం జలాల్‌పూర్‌ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆటోలో బోధన్‌ వైపు వెళ్తున్నారు. రుద్రూర్‌ శివారు ప్రాంతానికి చేరుకోగానే రోడ్డు పక్కనే ఉన్న భారీ వృక్షం ఒక్కసారిగా ఆటోపై కుప్పకూలింది. గమనించిన స్థానికులు వెంటనే ఆటోలో చిక్కుకున్న బాధితులను బయటికి తీశారు. క్షతగాత్రులు రహమత్‌, షేక్‌ హాజీ, గౌసియా బేగం, అలిమా, నియాన్‌ను 108 అంబులెన్స్‌లో బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అయితే బోధన్‌లో చికిత్స అనంతరం షేక్‌ హాజీ(58)ని స్వగ్రామానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా, భారీ వృక్షం కూలడంతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై రామ్‌ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక రైతులు, యువకులు పోలీసులకు సహకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement