భక్తిశ్రద్ధలతో కార్తీక ఆకాశ దీపోత్సవం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో కార్తీక ఆకాశ దీపోత్సవం

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

భక్తిశ్రద్ధలతో కార్తీక ఆకాశ దీపోత్సవం

కామారెడ్డి రూరల్‌/కామారెడ్డి అర్బన్‌/మాచారెడ్డి: జిల్లాలో కార్తీక మాసం పూజలు ప్రారంభయ్యాయి. ఇందులోభాగంగా మంగళవారం పలు ఆలయాల్లో ఆకాశ దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని త్రిశక్తి ఆలయం, లలితాత్రిపురసుందరి, శ్రీశారదా మాత, సంకష్టహర గణపతి ఆలయం, దేవునిపల్లి శ్రీరమా సత్యనారాయణ, ఇల్చిపూర్‌ శ్రీసరస్వతి, భూకన్‌పల్లి అభయాంజనేయస్వామి, శనేశ్వర, విశ్వనాథేశ్వర, రాజరాజేశ్వర ఆలయాల్లో భక్తులు ఆకాశ దీపాలను వెలిగించారు. అలాగే మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ఆకాశదీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఆధ్యాత్మికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement