● అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్వై గిరి
మాచారెడ్డి: భూ రీ సర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్ వై గిరి అధికారులను ఆదేశించారు. పాల్వంచ మండలం పోతారంలో బుధవారం గ్రామ సరిహద్దుల గుర్తింపుతో రీ సర్వే ప్రక్రియను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రీసర్వే నిర్వహించాలని సూచించారు. రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు, ఇతర అవసరమైన భూ పత్రాలతో సర్వేకు హాజరై అధికారులకు సహకరించాలని సూచించారు. రైతులందరూ సహకరిస్తే రీసర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పాల్వంచ తహసీల్దార్ జనార్దన్, జీపీవో సంజీవులు, పోతారం, భవానీపేట గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, రైతులు ఉన్నారు.


