భూముల రీసర్వే పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

భూముల రీసర్వే పారదర్శకంగా నిర్వహించాలి

Nov 12 2026 12:37 AM | Updated on Nov 12 2026 12:37 AM

భూముల రీసర్వే పారదర్శకంగా నిర్వహించాలి

కామారెడ్డి టౌన్‌ : రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియను రైతులకు మేలు జరిగేలా అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌ కుమార్‌తో కలిసి కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశపు హాల్‌ నుంచి అదనపు కలెక్టర్లు వి.విక్టర్‌, ఎన్‌.వై. గిరి, జిల్లా అధికారులు వీసీలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాలతోపాటు నక్షా లేని గ్రామాల్లో రీసర్వేను నవంబర్‌ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. రాబోయే ఏడాదిన్నరలో మూడు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే పూర్తి చేయడమే లక్ష్యమని తెలిపారు. రీసర్వే సమయంలో సంబంధిత రైతులకు ముందుగానే నోటీసులు ఇచ్చి, వారి సమక్షంలోనే సర్వే చేయాలని మంత్రి ఆదేశించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో దండోరా వేయించి వివరాలు వెల్లడించాలని, వచ్చిన అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. రీసర్వేలో అవకతవకలకు పాల్పడిన అధికారులపై సస్పెన్షన్‌తోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వీసీలో ఆర్డీవోలు రవీందర్‌, ప్రభాకర్‌, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ఈ నెలాఖరులోగా

తొలి విడత పూర్తి కావాలి

రైతుల సమక్షంలోనే సర్వే..

అభ్యంతరాల స్వీకరణ

తప్పు చేస్తే సస్పెన్షన్‌, క్రిమినల్‌ కేసులు

వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement