● అదనపు కలెక్టర్ విక్టర్
నిజాంసాగర్(జుక్కల్): జిల్లాలో 18 సంవత్స రాలు నిండిన యువతీయువకుల ఓటరు న మోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. మహమ్మద్‌నగర్ మండలం బూర్గుల్, గున్కుల్ గ్రా మాల్లో నిర్వహిస్తున్న ఓటరు నమోదు ప్రక్రియను ఆయన శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు నమోదుకు 18 సంవత్సరాల వయస్సు నిర్ధారణ పత్రాన్ని తప్పనిసరిగా జతపర్చాలన్నారు. ‘సర్’లో నోటీసులు ఇచ్చిన వారి నుంచి ధ్రువపత్రాలు సేకరించాలన్నారు.
ఇమ్యూనైజనేషన్ వివరాలు నమోదు చేయాలి
గర్భిణులతోపాటు చిన్నారుల ఇమ్యూనైజేషన్ వివరాలను రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. బూర్గుల్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఇమ్యూనైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట సర్పంచులు గజ్జల జీవన్, రమేశ్ యాదవ్, ఉప సర్పంచ్ గొల్ల రమ్యశ్రీ, తహశీల్దార్ లత, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, జీపీవో ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డిరూరల్/ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మండలం కల్యాణి, లింగారెడ్డిపేట గ్రామాలలో జరుగుతున్న క్రాప్ సర్వే పనులను ఏవో శోభ పరిశీలించారు. మండలంలోని లింగారెడ్డిపేట గ్రామంలో సేంద్రియ సాగు పంటలను ఆమె పరిశీలించారు. సేంద్రియ సాగుతో వ్యవసాయంతో పంటలలో అధిక దిగుబడిని సాధించవచ్చని పేర్కొన్నారు.


