భిక్కనూరు: మండల కేంద్రంతో పాటు జాతీయ రహదారిపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఆస్పత్రులకు సంబంధించిన మందులు పారబోస్తున్న వ్యక్తులను వైద్య సిబ్బంది పట్టుకున్నారు. శనివారం ఉదయం భిక్కనూరు జాతీయరహదారిపై రామేశ్వర్‌పల్లి సమీపంలో రోడ్డు పక్కన మిని డీసీఎం వ్యాన్‌లో నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు సంబంధించిన మందులను పారపోస్తుండగా భిక్కనూరు ప్రభుత్వాసుపత్రికి చెందిన పార్మసిస్టూ స్వామి, హెల్త్ అసిస్టెంట్ సతీష్, అటేండర్లు శ్రావన్, అబేద్‌అతీ, భాస్కర్‌లు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారితో పాటు మందులను మిని డీసీఎం వ్యాన్‌ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని ప్రశ్నించగా తాము కొరియార్ సంస్థకు చెందిన వ్యక్తులమని వాహనం కూడా కొరియార్ సంస్థకు చెందినదని చెప్పారు. ఈ విషయమై పీహెచ్‌సీ వైద్యురాలు యెమిమా జిల్లా వైద్యాధికారి వెంకటికి సమాచారం అందించారు. డీసీఎం వ్యాన్‌లో ఈ మందుల బిల్లు రూ.12లక్షలు అని ఉంది.
కామారెడ్డి రూరల్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరిగా పూర్తి చేసుకోవాలని హౌజింగ్ డీఈ సుభాష్ సూచించారు. శనివారం మండలంలోని రాఘవపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం లబ్ధిదారులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ, ఇళ్ల నిర్మాణ పనులు సజావుగా జరిగేలా చర్యలు చేపడుతోందన్నారు. ఏఈ రాము, సర్పంచ్ ఎడ్ల వినీల నరేశ్, ఉప సర్పంచ్ నరేశ్, గ్రామ కార్యదర్శి మాధవి లత పాల్గొన్నారు.


