బిచ్కుంద: బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టులో శనివారం మండల న్యాయసేవా అధికార సంస్ధ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి వినిల్ కుమార్ మాట్లాడుతూ ఆవేశాలకు లోనుకాకుండా చిన్నచిన్న తగాదాలకు కొట్లాడుకోవద్దు ఏదైనా సమస్యలు ఉంటే గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచించారు.అడ్వకేట్లు, ఎకై ్సజ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో న్యాయమూర్తి సుష్మ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోదగ్గ కేసులను పరిష్కరించారు. 385 కేసుల్లో రూ. 32,61,710 లక్షలు అమౌంట్‌ను సెటిల్‌మెంట్ చేశారు. న్యాయవాదులు శ్రీనివాస్, సాయిప్రకాష్, గోపాల్‌రావు, పండరి తదితరులు ఉన్నారు.


