రైస్‌ మిల్లర్లలో వణుకు | - | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లర్లలో వణుకు

Aug 25 2026 12:57 AM | Updated on Aug 25 2026 12:57 AM

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కస్టం మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) బకాయిలను రికవరీ చేసే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఏళ్ల తరబడిగా బియ్యం ఇవ్వకుండా సొంతానికి వాడేసుకున్న మిల్లర్లను పలుమార్లు హెచ్చరించినా దారికి రాకపోవడంతో కేసులు నమోదు చేస్తోంది. ఇదే సమయంలో తాజా సీఎంఆర్‌ కేటాయింపులకు సంబంధించి ఆయా మిల్లుల్లో ఉండాల్సిన నిల్వల్లో తేడా కనిపిస్తే వెంటనే కేసులు పెడుతున్నారు.

జిల్లాలో 2021–22 ఖరీఫ్‌ నుంచి మొదలుకుని 2024–25 ఖరీఫ్‌ వరకు 47 మిల్లులు కలిపి రూ. 201 కోట్ల విలువైన సీఎంఆర్‌ ఇవ్వాల్సి ఉంది. నో టీసులు, కేసులతో ఇప్పటి వరకు రూ.30 కోట్ల మే ర రికవరీ జరిగింది. ఇంకా రూ.171 కోట్ల మేర బ కాయిలున్నాయి. ఏళ్ల తరబడిగా బియ్యం ఇవ్వకుండా మొండికేస్తున్న మిల్లర్లపై ప్రభుత్వం తీసుకుంటు న్న చర్యలు రైస్‌ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఐదా రు నెలలుగా డీఫాల్ట్‌ మిల్లర్లపై ప్రభుత్వం రకరకాల చర్యలకు పూనుకుంటోంది. బియ్యం ఇవ్వకుండా బుకాయిస్తున్నవారికి పలుమార్లు నోటీసులు ఇచ్చా రు. అయినా దారికి రాకపోవడంతో పోలీసు కేసుల నమోదుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లాలో ప లువురు మిల్లర్లపై ఆయా పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వారి ఆస్తులను జప్తు చేసేందుకు ఆర్‌ఆర్‌ యాక్ట్‌ను ప్రయోగించే అవకాశాలు ఉండడంతో మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.

విజిలెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌ దాడులు

మొన్నటి ఖరీఫ్‌, యాసంగి సీజన్లలో కస్టం మిల్లింగ్‌ కోసం ఇచ్చిన ధాన్యం నిల్వలు లెక్క ప్రకారం మి ల్లుల్లో ఉన్నాయా అన్నదానిపై అధికారులు ఫోకస్‌ చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌, విజిలెన్స్‌ విభాగాలు దాదాపు పది మిల్లులపై దాడు లు చేశాయి. ఈ సందర్భంగా పలు మిల్లుల్లో ధా న్యం నిల్వల్లో తేడా ఉందని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. కామారెడ్డిలో ఓ మిల్లులో రూ. 7.51 కోట్ల విలువైన ధాన్యం లేదని గుర్తించారు. అలాగే మాచారెడ్డి మండలం లచ్చాపేటలో ఓ మి ల్లులో రూ. 6.46 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు మాయమైనట్టు గుర్తించారు. కామారెడ్డిలోని మరో రైస్‌ మిల్లులో రూ. 52 లక్షల విలువైన ధాన్యం లేదని గుర్తించి కేసులు నమోదు చేశారు. జిల్లాలోని మరికొన్ని మిల్లుల్లోనూ తనిఖీలు జరిగాయి.

అధికారుల్లోనూ..

సీఎంఆర్‌ బకాయిల వసూళ్లతోపాటు తాజాగా కేటాయించిన ధాన్యం మిల్లుల్లో లెక్క ప్రకారం నిల్వలు ఉండేలా ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అయితే స్థానికంగా ఉన్న పరిస్థితులు, రాజకీయ ఒత్తిడులతో అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదన్న విమర్శలున్నాయి. అయితే మిల్లుల్లో ధాన్యం నిల్వలు లేకుంటే కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేసే అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. దీంతో అధికారులు కూడా వణుకుతున్నారు.

సీఎంఆర్‌ బకాయిల వసూళ్లపై

సర్కారు దృష్టి

కొరడా ఝుళిపిస్తున్న అధికారులు

తాజా కేటాయింపు నిల్వలపైనా తనిఖీలు

బ్యాలెన్స్‌లో తేడా ఉంటే కేసులే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement