నిజాంసాగర్: మహమ్మద్‌నగర్, బాన్సువాడ, గాంధారి మండలాల్లో కురుస్తున్న వర్షాలకు మహమ్మద్ నగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్‌లోకి సోమవారం 975 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో రిజర్వాయర్ మూడు వరద గేట్లను ఎత్తి ప్రధాన కాలువకు నీటిని మళ్లిస్తున్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 416.550 మీటర్లు కాగా సోమవారం సాయంత్రానికి 415.900 మీటర్ల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
నిజాంసాగర్‌లోకి 3,185 క్యూసెక్కులు..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 3,185 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1,401.06 అడుగుల (12.541 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
కౌలాస్‌నాలానుంచి..
నిజాంసాగర్ : సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి 890 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ఒక గేటును ఎత్తి 510 క్యూసెక్కుల నీటిని మంజీర నది లోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు) కాగా.. సోమవారం సాయంత్రానికి 457.83 మీటర్ల (1.196 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
‘పోచారం’లోకి పెరిగిన వరద
నాగిరెడ్డిపేట : పోచారం ప్రాజెక్ట్‌కు సోమవారం మ ళ్లీ వరదనీటి తాకిడి పెరిగింది. ప్రాజెక్టులోకి 3,637 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపా రు. 100 క్యూసెక్కుల నీరు ప్రధాన కాలువలోకి వి డుదలవుతుండగా మరో 3,537 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు అలుగు పైనుంచి దిగువకు ప్రవహిస్తోందని ఇరిగేషన్ ఏఈ అక్షయ్‌కుమార్ తెలిపారు.


