● 1,246 మందికి ఉద్యోగ ఆఫర్లు
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో నిర్వహించిన అతిపెద్ద జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మదన్‌మోహన్‌రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం జాబ్‌మేళా నిర్వహించారు. మేళాకు హాజరైన కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగులతో ఎమ్మెల్యే మాట్లాడారు. 10 వేల మందికిపైగా కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. 80 జాతీయ, బహుళజాతి సంస్థలు పాల్గొని వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను క ల్పించాయన్నారు. 1,246 మందికి స్పాట్ జాబ్ ఆ ఫర్లు లభించాయని పేర్కొన్నారు. ఒకే వేదికపై ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగార్థులు పాల్గొని, ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో నేరుగా మాట్లాడి ఉద్యోగ అవకాశాలను పొందడం యువతలో నూతన ఉత్సాహాన్ని నింపిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, వైస్ చైర్‌పర్సన్ భాగ్యవతి, కౌన్సిలర్లు తిరుపతి, గఫార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిబాబా, నాయకులు పాల్గొన్నారు.


