సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మంగళవారం నిజామాబాద్ లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ పసుపుబోర్డు కార్యాలయంలో ‘సునహరీ మిట్టి అభియాన్’కు ఆయన శ్రీకా రం చుడతారు. ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా భూమారెడ్డి కన్వెన్షన్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఎస్పీని కలిసిన పోలీస్ అధికారుల
సంఘం జిల్లా అధ్యక్షుడు
కామారెడ్డి క్రైం : జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధులు సోమవారం ఎస్పీ రాజేశ్ చంద్ర ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఎన్నికలు జరిగాయి. సదాశివనగర్ పీఎస్‌లో విధుల నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రంజిత్‌రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికవగా, ఉపాధ్యక్షులుగా సంతోష్ కుమార్, సాయి ప్రసన్న, కార్యదర్శి గా శ్రీధర్, కోశాధికారిగా సాయిలు, సహ కా ర్యదర్శిగా మధుకర్, కార్యనిర్వాహక కార్యదర్శిగా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. వారు సో మవారం డీపీవోలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భగా నూతన కమిటీ ప్రతినిధులను ఎ స్పీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ నరసింహారెడ్డి, సీఐ లు, ఎస్సైలు పాల్గొన్నారు.
న్యాయమూర్తికి వీడ్కోలు
కామారెడ్డి టౌన్ : జడ్జి సుధాకర్, సీఏవో రా మచంద్రరావు విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధత కనబరుస్తూ విశేష సేవలందించారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.ముక్తిద పేర్కొన్నా రు. సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, నిజామాబాద్‌కు బదిలీ అయిన జిల్లా న్యాయ శాఖ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (సీ ఏవో) రామచంద్రరావులకు సోమవారం జి ల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ఘనంగా వీడ్కోలు పలికారు. నిజామాబాద్ నుంచి పదోన్నతిపై వచ్చి కామారెడ్డి సీఏవోగా బా ధ్యతలు స్వీకరించిన ఎస్.సుజాతకు స్వాగ తం పలికారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి సుమలత, మొబైల్ మేజిస్ట్రేట్ బి.దీక్ష, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జె. భుజంగరావు, సూపరింటెండెంట్లు వెంకటరెడ్డి, నాగేంద్ర, కరుణ, సంధ్య, చందసేన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
27న మహాధర్నా
కామారెడ్డి అర్బన్: సమస్యల పరిష్కారం కో సం ఈనెల 27న కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ఎంప్లాయీ స్ జేఏసీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, కన్వీనర్ దేవేందర్ తెలిపారు. సోమవారం అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఎస్పీ రాజేశ్ చంద్రలను కలిసి ధర్నా విషయమై సమాచారం అందించారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు మనోహర్‌రావు, నాగరాజు, దేవరాజు, భూమయ్య, శివకుమార్‌లు పాల్గొన్నారు.
సీసీఆర్‌టీ శిక్షణలో
పిట్లం టీచర్
పిట్లం: సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ సంస్థ ఈనెల 12 నుంచి 21 వరకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో మండలంలోని చౌట కట్టు తండా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రియాంక పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఎంఈవో దేవిసింగ్ తెలిపారు. భారతీయ సంస్కృతి, జానపదకళలు, సంగీతం, నృత్యం, చిత్రకళలు, బొమ్మలాట, వారసత్వ కట్టడాలు, హస్తకళలు, స్థానిక సంప్రదాయాలు, విలువల విద్య వంటి అంశాలపై అధ్యయనం చేసినట్లు ప్రియాంక తెలిపారు.


