కామారెడ్డి టౌన్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బకాయిల విడుదలకోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా సోమవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నరాజులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల మధ్య విద్యార్థుల భవిష్యత్తు నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.


